Rakul: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమై తన అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్‌సింగ్. ఇటీవలే జాకీ భగ్నానితో రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, వీరిద్దరు పెళ్లి సన్నహాలు కూడా మొదలు పెట్టినట్లు సమాాచారం. అయితే, వీరిద్దరి బంధం ఎక్కువకాలం నిలవదని, త్వరలోనే విడిపోతారని పాపులర్ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గతంలో నాగచైతన్య, సమంత- రూత్ ప్రభు, అఖిల్ అక్కినేని గురించి ఈయన చెప్పిన జోష్య నిజయం అయిన నేపథ్యంలో ఈ విషయంపై నెట్టింట చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే, జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్‌సింగ్ సమస్యలను ఎదుర్కొంటారని, వీరి రాశుల్లో గ్రహాల స్థానాలు వివాహానికి అనుకూలంగా లేవని వేణుస్వామి వెల్లడించారు.
అంతేకాకుండా, రకుల్, జాకీ నిశ్చితార్థం రద్దవుతుందని, త్వరలోనే వీరి బంధం బ్రేకప్‌తో ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాదని వివాహం చేసుకుంటే, వైవాహిక జీవితంలో తట్టుకోలేని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. చట్టపరమైన సమస్యలతో రకుల్ జైలుకు వెళ్తుందని చెప్పి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చారు. కాగా ఇటీవలే ‘కొండపొలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ‘ఓబులమ్మ’గా అలరించింది. క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరో. కొండపొలం నవల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి కాస్త ప్రేమ కథ జోడించి రసవత్తరంగా మలిచారు క్రిష్. తొలుత ఈ సినిమాను సుకుమార్, హరీశ్ శంకర్ తదితరులు తీయాలనుకున్నారు. చివరకు క్రిష్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Popular astrologer shocking comments on rakul jacky relationship
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com