Teja Sajja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక పాన్ ఇండియాలో గొప్ప విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న వారిలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేసిన పాన్ ఇండియా సినిమాలు భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…బాహుబలి తో మొదలైన ప్రభంజనం ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో కూడా పెను ప్రభంజనాన్ని సృష్టించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… అల్లు అర్జున్ సైతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పుష్ప 2 సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక వీళ్లిద్దరికి పాన్ ఇండియాలో చాలా మంచి మార్కెట్ అయితే ఉంది. ఇక వీళ్ళతో పాటుగా రామ్ చరణ్ కి కూడా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు ఉంది. ఇక తన సినిమాలకి కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి…
ఇక వీళ్ళ విషయం పక్కన పెడితే హనుమాన్ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన తేజ సజ్జ ఇప్పుడు మిరాయ్ సినిమాతో మరోసారి 600 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగోడతాడనే అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదే కనక జరిగితే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల రికార్డులను సైతం తను బ్రేక్ చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
సోలోగా వీళ్ళిద్దరు 500 కోట్ల గ్రాస్ ను టచ్ చేసిన సినిమాలు అయితే లేవు. ఇక దేవర సినిమా 500 కోట్ల మార్కు ను టచ్ చేసిందని చెప్పినప్పటికి 450 కోట్ల దగ్గరే ఆగిపోయిందని సినిమా మేధావులు సైతం అప్పట్లో కామెంట్స్ అయితే చేశారు. ఇక మొత్తానికైతే 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కనక రాబట్టినట్లైతే ఇటు మహేష్ బాబు, అటు ఎన్టీఆర్ ఇద్దరి రికార్డులను బ్రేక్ చేసి ముందుకు దూసుకెళ్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు ఇప్పుడు స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే రేంజ్ కి ఎదుగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పటి వరకు తను చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి విజయాలను సాధించాడు. ఇకమీదట కూడా ఇలాంటి విజయాలను సాధిస్తూ ముందుకెళ్తే మాత్రం పాన్ ఇండియాని శాసించే హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…