Anushka Shetty Letter: సౌత్ ఇండియా లో ఉండే హీరోయిన్స్ లో హీరోల అవసరం లేకుండా, కేవలం తమ ఇమేజ్ తో థియేటర్స్ కి రప్పించగల సత్తా ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో మన అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు అనుష్క శెట్టి(Anushka Shetty). ‘అరుంధతి’ సినిమా నుండి ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవ్వలేదు కానీ, మంచి ఓపెనింగ్స్ ని అయితే తెచుకోగలిగాయి. ఆయన చివరి లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘భాగమతి’ అటు ఓపెనింగ్స్ పరంగా కానీ,లాంగ్ రన్ పరంగా కానీ భారీ వసూళ్లను సొంతం చేసుకున్న సినిమాగా నిల్చింది. ఆ తర్వాత ఈమె సినిమాలు చేసే సంఖ్య బాగా తగ్గించేసింది. 2023 లో ‘మిస్ శెట్టి ..మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం తర్వాత మళ్లీ ఈమె ‘ఘాటీ'(Ghaati Movie) చిత్రం ద్వారా రీసెంట్ గానే మన ముందుకు వచ్చింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ ని ఏర్పాటు చేసుకుంది. అందుకు కారణం అనుష్క చాలా కాలం తర్వాత వీరోచిత యాక్షన్ సన్నివేశాల్లో కనిపించడమే. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని క్లోజింగ్ లో కనీసం మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేక ఈ ఏడాది భారీ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల్లో ఒకటిగా నిల్చింది. ఇంతటి డిజాస్టర్ తర్వాత అనుష్క ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే సోషల్ మీడియా మాధ్యమాలలో ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. మా స్వీటీ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుందంటే ఆమెని ఈ సినిమా ఫలితం ఎంత నొచ్చుకునేలా చేసిందో అర్థం అవుతుంది అంటూ అభిమానులు ఫీల్ అవుతున్నారు.
ఇంతకీ ఆమె వేసిన ట్వీట్ ఏమిటంటే ‘సోషల్ మీడియా కి కొంతకాలం దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. మళ్లీ మీ అందరితో కలవడానికి సరికొత్త నూతనోత్సాహం తో వస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. అనుష్క సినిమాలు చాలా తక్కువ గా చేస్తూ వస్తుంది, ఆమె మీడియా ముందు ప్రొమోషన్స్ కి రావడం కూడా పూర్తి గా మానేసింది. ఘాటీ మీడియా ప్రొమోషన్స్ కి కూడా ఆమె చాలా దూరంగా ఉంటూ వచ్చింది. కేవలం వాయిస్ నోట్స్ తోనే సరిపెట్టింది. పోనిలే కనీసం సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ ఈ మాత్రం అయినా అభిమానులతో టచ్ లో ఉందని అనుకుంటే, ఇప్పుడు సోషల్ మీడియా కి కూడా ఆమె గుడ్ బై చెప్పేసింది. ఇక అనుష్క ని మేము ఎలా చూడాలి, ఆమెతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, మళ్లీ ఆమెని వెండితెర పై చూసే అదృష్టం ఎప్పుడు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో రోదిస్తున్నారు.