Teja Sajja: సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట సింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు వరుస సినిమాలను చేస సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఆయన సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఆయన సినిమాల మీద సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే తన కొడుకు అయిన మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు… ఇక ప్రశాంత్ వర్మ ఆన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ చేస్తున్నప్పుడు ‘హనుమాన్’ సినిమా స్టోరీని మోక్షజ్ఞ కి వినిపించాడట. కానీ బాలయ్య బాబు మాత్రం దీనికి సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ మోక్షజ్ఞ తో కాకుండా తేజ సజ్జ తో చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక కార్తీక్ ఘట్టమనేని సైతం మొదట మిరాయ్ సినిమా కోసం మోక్షజ్ఞ ని హీరోగా తీసుకోవాలనుకున్నారట. ఇక ఈ ప్రాజెక్టు అతనికి సెట్ అవ్వదని బాలయ్య బాబు చెప్పడంతో కార్తీక్ డైరెక్ట్ గా తేజ సజ్జ కి కథ వినిపించి అతనితో ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడనే టాక్ అయితే వినిపిస్తుంది.
ఇక ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడమే కాకుండా తేజ సజ్జ కి మరో సక్సెస్ ని కూడా తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి…ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం…ఇక ఈ రెండు సినిమాలు మోక్షజ్ఞ చేయాల్సింది. కానీ తేజ సజ్జ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
మరి ఇప్పటికైన మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద సరైన క్లారిటీ ఇస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటి వరకైతే మోక్షజ్ఞ చేస్తున్న సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయితే రావడం లేదు. ఇక తేజ సజ్జ ను చూసిన చాలా మంది నిన్న కాకమొన్న వచ్చిన కుర్ర హీరో సక్సెస్ ల మీద సక్సెస్ లు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
మోక్షజ్ఞ ఇంకా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు ఎప్పుడు ఆయన స్టార్ హీరోగా అవతరిస్తాడు అంటూ మరి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…ఇక మొత్తానికైతే మోక్షజ్ఞ చేయాల్సిన రెండు సినిమాలతో తేజ సూపర్ సక్సెస్ ని సాధించి అతనికి రావాల్సిన స్టార్ డమ్ ని తను దక్కించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…