Hanuman : తెలుగు సినిమా అంటే ఇప్పుడు కేవలం ప్రాంతీయ బాషా చిత్రమో..లేదా పాన్ ఇండియన్ చిత్రమో కాదు..పాన్ వరల్డ్ చిత్రం..భాష తో సంబంధం లేకుండా ప్రతీ రాష్ట్రం లో , ప్రతీ దేశం లో తెలుగు సినిమాకి అభిమానులు ఉన్నారు..మన టాలీవుడ్ లో ప్రతిభ ఉన్న దర్శకులకు కొదవే లేదు..భారీ బడ్జెట్ తో హాలీవుడ్ లెవెల్ లో సినిమాలు తియ్యగలరు..అసలు బడ్జెట్ లేకుండా తక్కువ ఖర్చు తో అద్భుతమైన విజువల్స్ తో సినిమాలను కూడా తియ్యగలరు.

అలా ఇటీవల కాలం లో వచ్చిన దర్శకులలో ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీ టీజర్ తో అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు..అప్పుడే 500 కోట్ల రూపాయలతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తీసిన ‘ఆది పురుష్’ మూవీ టీజర్ వచ్చింది..దారుణమైన ట్రోల్ల్స్ ఎదురుకుంది..అదే సమయం లో వచ్చిన ‘హనుమాన్’ టీజర్ అందరిని అబ్బురపరిచింది..ఇంత తక్కువ బడ్జెట్ తో ఇంత అద్భుతంగా ఎలా తీసాడు అని అందరూ ఆశ్చర్యపోయారు.
అలా టీజర్ తోనే సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాని ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ..తెలుగు , హిందీ , కన్నడ , మలయాళం మరియు తమిళం తో పాటుగా..చైనీస్ , జపనీస్, కొరియన్ మరియు స్పానిష్ బాషలలో కూడా విడుదల చేస్తున్నారు..సినిమా కంటెంట్ మీద డైరెక్టర్ కి మరియు మేకర్స్ కి ఉన్న నమ్మకం అలా ఉంది మరి.
ఈ సినిమా అనుకున్న రీతిలో ప్రభంజనం సృష్టిస్తే హీరో గా చేసిన తేజ సజ్జల దశ మారిపోయినట్టే అని చెప్పొచ్చు..అంతే కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి కూడా రాజమౌళి కి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు వస్తాయి..ఈ డైరెక్టర్ సినిమాలన్నీ కూడా కాస్త కొత్త రకంగానే ఉంటాయి..హిట్టు మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు ఆయన..మరి ఇప్పుడు హనుమాన్ తో తన ప్రతిభ కి తగ్గట్టు గా గుర్తింపు లభిస్తుందో లేదో చూడాలి.
#HanuManFromMay12th pic.twitter.com/SIDCSD6wns
— Teja Sajja (@tejasajja123) January 9, 2023