Samantha : స్టార్ లేడీ సమంత రెండేళ్లుగా వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు దూరం కావడం ఆమె తట్టుకోలేకపోయారు. సమంత వివాహ బంధం చేదుగా ముగిసింది. దానికి తోడు సమాజం నుండి నిందలు ఎదుర్కొన్నారు. అందరూ సమంతను టార్గెట్ చేశారు. చైతన్య మంచివాడని నిరూపించడానికి ఒక వర్గం పనిగట్టుకుని ప్రచారం చేశారన్న వాదన ఉంది. సమంతపై సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదని. స్వేచ్ఛా జీవితం కోరుకుంటుందని. ఎఫైర్స్ పెట్టుకుందంటూ మీడియాలో ప్రచారమైంది.

ఇదంతా కొందరు కావాలని చేపించారని సమంత వర్గం అంటారు. నిజం ఏదైనా నష్టపోయింది మాత్రం సమంతనే. విడాకుల డిప్రెషన్ నుండి బయటపడేందుకు సమంత అనేక మార్గాలు అనుసరించారు. విహారాలకు వెళ్లారు. ఆధ్యాత్మిక గురువులను కలిశారు. ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొన్ని పుస్తకాలు చదివారు. విడాకుల బాధ నుండి బయటపడగానే ఆమెకు మరో పరీక్ష ఎదురైంది. అరుదైన మయోసైటిస్ బారినపడ్డారు ఆమె.
ఈ విషయాన్ని గత ఏడాది అక్టోబర్ లో సమంత వెల్లడించారు. కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమై సమంత చికిత్స తీసుకుంటున్నారు. వ్యాధి ఏదైనా కానీ, బయటపడాలంటే మానసిక ప్రశాంత చాలా అవసరం. దాని కోసం ఆమె ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నారనిపిస్తుంది. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా సమంత చేతిలో జపమాల కనిపిస్తుంది. ఇటీవల సమంత ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. అప్పుడు ఆమె చేతిలో జపమాల ఉంది. నేడు శాకుంతలం ట్రైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్నారు.
అక్కడకు కూడా సమంత చేతిలో జపమాల పట్టుకొని వచ్చారు. మరొక అంశం ఆమె వైట్ కలర్ డ్రెస్లు ధరిస్తున్నారు. ఇవ్వన్నీ గమనిస్తుంటే సమంత మూఢనమ్మకాలు నమ్ముతారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. జపం చేయడం యోగాలో ఒక భాగం. అయితే జపమాల ఎప్పుడూ చేతిలో పట్టుకొని తిరుగుతున్న సమంత ఏదో సెంటిమెంట్ అనుసరిస్తున్నారు అంటున్నారు. ఆమె వైట్ కలర్ డ్రెస్లు వేయడం వెనుక కారణం ఇదే కావచ్చు అంటున్నారు. కాగా విడుదలైన శాకుంతలం ట్రైలర్ ఆకట్టుకుంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది.