Teja: సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఓవర్ బడ్జెట్ కారణంగా ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలైతే వస్తున్నాయి. వాటిని తగ్గించడానికి ఇండస్ట్రీ తరుపునుంచి ఎవరో ఒకరు పూనుకోవాల్సిన అవసరమైతే ఉంది. హీరోలకు పెరిగిన రెమ్యూనరేషన్లు, సినిమా గ్రాండీయర్ కోసం అవసరం ఉన్నా లేకపోయిన గ్రాఫిక్స్ వర్క్ మీద డిపెండ్ అవ్వడం, రాసుకున్న కథలో దమ్ము లేకపోవడం… ఇవన్నీ కలిపి ఒక సినిమాను చంపేస్తున్నాయి… ఇక సినిమా ఎలా తీయాలి అనే విషయ మీద డైరెక్టర్ తేజ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇప్పుడొస్తున్న చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను చాలా ఓపెన్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన ఒక కథని చెబుతూ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో వివరించాడు. ఒక పూరి గుడిసెలో ఉన్న ఒక ముసలావిడ ను ఒక బ్రేకులు ఫెయిల్ అయిన ఆటో వచ్చి గుద్దడంతో ఆమె చనిపోతుంది.. ఇది మనం రాసుకున్న కథ…ఇక అక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుతోంది. ఇప్పుడు ఈ కథకి ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ ఇస్తే పూరి గుడిసెలో ఒక ముసలి జూనియర్ ఆర్టిస్టుతో ఆ సీన్ తీస్తారు. కానీ ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ వేరు కాబట్టి ఆ బడ్జెట్ మనం సినిమాలో అప్లై చేసి రిజల్ట్ చూపించాలనే ఉద్దేశ్యంతో కొంతమంది దర్శకులు ఆ గుడిసెను తాటి ఆకులతో వేడి లోపల మొత్తం బ్రైట్ గా ఉండడానికి ఎల్లో కలర్ వేస్తారు. అలాగే పైన ఒక లైట్ ను పెడతారు. ఇక బడ్జెట్ పెరిగిపోయింది కాబట్టి ఆ ముసలావిడ ప్లేస్ లో సీనియర్ హీరోయిన్ ఎవరో ఒకరిని పెడతారు.
ఇక ఆ సీనియర్ హీరోయిన్ కింద కూర్చోకూడదు కాబట్టి ఆమె కోసం ఒక కుర్చీ వేసి అందులో కూర్చోబెడతారు… ఇక ఆటో వచ్చి గుడిసెను గుద్దితే అంత ఎఫెక్ట్ గా లేదని, ఒక బెంజు కారును స్లమ్ లోకి తీసుకొచ్చి గుడిసెను గుద్దినట్టుగా చూపిస్తారు… ఇక గుడిసెలో ఉన్న పెద్దావిడ ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది. కాబట్టి ఆమె బ్రైట్ గా కనిపించడానికి కొంచెం లిప్ స్టిక్ వేస్తారు.
ఇక ఇవన్నీ చేయడం వల్ల దీనివల్ల ఆమె పేదింటి ఆవిడ అనే ఫీల్ మనకి రాదు. ఈ బెంజ్ కార్ ఏసుకొని వాడు స్లమ్ లోకి వచ్చి గుడిసెను ఎందుకు గుద్దాడో అనే సీన్ కి లాజిక్ ఉండదు. కానీ డైరెక్టర్ రాసుకున్న ఆటో వచ్చి గుద్దే సీన్ మాత్రం ప్రాపర్ గానే ఉంది. కానీ ఓవర్ బడ్జెట్ వల్ల ఇక్కడ మనం చూపించాల్సిన ఫీల్ అనేది మారిపోతుంది. కాబట్టి ఒక కథకి ఎంత బడ్జెట్ కావాలో ఆ కథే నిర్ణయిస్తుంది. దానికి మించి ఒక్క రూపాయి ఎక్కువ పెట్టకూడదు.
కథ డిమాండ్ చేసిన దానికంటే ఒక్క రూపాయి కూడా తక్కువ పెట్టకూడదు. అలా పర్ఫెక్ట్ బడ్జెట్ లో చేసినప్పుడే కాస్ట్ ఆఫ్ బడ్జెట్ భారీగా తగ్గి ప్రోడక్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో బడ్జెట్ ఫెయిల్యూర్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఆయన చెప్పిన కథ ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…