Teenmar Mallanna : ప్రస్తుతం ఇండియా వైడ్ గా పుష్ప 2 సినిమా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతూ వరల్డ్ వైడ్ గా 1600 కోట్ల కలెక్షన్లను రాబట్టింది…ఇక రాబోయే రోజుల్లో కూడా పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి భారీ రికార్డు నెలకొల్పే దిశగా ముందుకు సాగుతుండటం విశేషం…ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతుంది. అలాగే ఇండియా వైడ్ గా భారీ రికార్డులను కూడా కొల్లగొట్టబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న తీన్మార్ మల్లన్న పుష్ప 2 సినిమా దర్శకుడు అయిన సుకుమార్ మీద బూతుల వర్షాన్ని కురిపించాడు. నిజానికి ఆయన అలా కోపానికి రావడానికి సుకుమార్ ని తిట్టడానికి గల కారణం ఏంటి అంటే పుష్ప 2 సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న బన్వర్ సింగ్ షేకవత్ క్యారెక్టర్ పుష్ప అనే ఎర్రచందనం స్మగ్లర్ ను పట్టుకోవడానికి నియమించబడతాడు.
మరి అలాంటి ఒక క్యారెక్టర్ చేత మంచి చేయించాల్సింది పోయి పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్ స్విమ్మింగ్ పూల్ లో మూత్రం పోస్తే దాంట్లో భన్వర్ సింగ్ షేకవత్ అనే క్యారెక్టర్ స్నానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు ఆ సీను ఎలా రాశావురా అంటూ సుకుమార్ మీద తీన్మార్ మల్లన్న బూతులతో చెలరేగిపోయాడు…ఇక దీంతో మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. ఇంకా గొప్ప సినిమా తీశానని ప్రమోట్ చేసుకుంటున్నారా అంటూ ఆయన విపరీతమైన కామెంట్లైతే చేశాడు.
ఇక మొత్తానికైతే సుకుమార్ ను టార్గెట్ చేసి తీన్మార్ మల్లన్న ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది సుకుమార్ అభిమానులను కొంతవరకు ఇబ్బంది పెడుతున్నప్పటికి మరి కొంతమంది మాత్రం తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలకు మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే సుకుమార్ సినిమా అంటే ఇంతకుముందు క్వాలిటీ ఉండేది. కానీ ఈ సినిమాను జస్ట్ హైప్ కోసమే చేశారు. అలాగే ఇలాంటి కొన్ని అసభ్యకరమైన సీన్లను కూడా ఇందులో జోడించడం పట్ల పోలీసులు కూడా కొంతవరకు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తున్న క్రమంలో ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ రావడం వల్ల ఆ సినిమా కలెక్షన్స్ మీద ఏదైనా దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొంతమంది సినీ సెలబ్రిటీలు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…