https://oktelugu.com/

Manchu Manoj : మా అన్న నుండి నన్ను కాపాడండి’ అంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మనోజ్!

వీళ్ళ గొడవని జనాలు పూర్తిగా మర్చిపోతున్న సమయంలో, మనోజ్ మళ్ళీ తన అన్న విష్ణు పై కేసు వేసేందుకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. విష్ణు నుండి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీలతో కూడిన ఒక కంప్లైంట్ ని పోలీస్ స్టేషన్ లో అందచేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 09:55 PM IST

    Manchu Manoj Complaint

    Follow us on

    Manchu Manoj :  మంచు కుటుంబం లో గొడవలు ఇంకా చల్లారలేదు. గత నెల రోజులుగా ఈ కుటుంబ వ్యవహారం మీడియా లో ఎంతటి సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మనోజ్, మోహన్ బాబు మధ్య ఘర్షణ జరగడం, ఆ తర్వాత మనోజ్ మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం, మోహన్ బాబు కూడా తన కొడుకుని ఇంటి నుండి బయటకి గెంటేయాలని పోలీసు కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత ఆయన మనోజ్ పై ఆరోపణలు చేస్తూ ఒక ఆడియో నోట్ ని మీడియా కి విడుదల చేయడం వంటివి పెను దుమారం రేపింది. ఈ వ్యవహారం లో మీడియా తలదూర్చినందుకు మోహన్ బాబు ఒక రిపోర్టర్ పై దాడి చేసిన ఘటన కూడా సెన్సేషనల్ గా మారింది. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెరమీదకు రావడంతో మోహన్ బాబు వివాదం పక్కకి మరలింది.

    ఇక వీళ్ళ గొడవని జనాలు పూర్తిగా మర్చిపోతున్న సమయంలో, మనోజ్ మళ్ళీ తన అన్న విష్ణు పై కేసు వేసేందుకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. విష్ణు నుండి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీలతో కూడిన ఒక కంప్లైంట్ ని పోలీస్ స్టేషన్ లో అందచేసాడు. కేవలం విష్ణు మీద మాత్రమే కాకుండా మోహన్ బాబు విద్యాసంస్థలను మ్యానేజ్ చేస్తున్న వినయ్ మీద కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఈ వ్యవహారం పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. గత కొద్దీ రోజుల క్రితమే మనోజ్ తన అన్నయ్య విష్ణు మా ఇంటికి పెట్టి ఉన్న జనరేటర్ లో పంచదార పోసాడని, ఆ కారణం చేత మాకు విద్యుత్తూ సరఫరా ఆగిపోయిందని, పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ వీడియో ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నవ్వుకున్నారు.

    అయితే ఇంతలోపే విష్ణు పై ఈ స్థాయి ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నేడు మోహన్ బాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ని హై కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఏ క్షణం లో అయినా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. ఇంతలోపే మనోజ్ ఇలా కేసు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మనోజ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో విషయాలను కోర్టు దాకా ఎందుకు తీసుకొస్తున్నాడు, గౌరవంగా ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన సమస్యని వీధుల్లో పెట్టడం వల్లే కదా, మోహన్ బాబు అదుపు తప్పి మీడియా రిపోర్టర్ పై దాడి చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పరువు మొత్తం పోయినట్టే కదా, తండ్రి పరువు ఎవరైనా అలా తియ్యాలని అనుకుంటారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.