https://oktelugu.com/

Daku Maharaj pre-release event : డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్..? ముహూర్తం కూడా ఫిక్స్!

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ఈవెంట్ ని నార్త్ అమెరికా లో గ్రాండ్ గా వచ్చే నెల నాల్గవ తేదీన చెయ్యబోతున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా మొదలయ్యాయి. అదే విధంగా విజయవాడ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చెయ్యబోతున్నారు మేకర్స్.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 09:45 PM IST

    Daku Maharaj pre-release event

    Follow us on

    Daku Maharaj pre-release event : నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో, లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ఈవెంట్ ని నార్త్ అమెరికా లో గ్రాండ్ గా వచ్చే నెల నాల్గవ తేదీన చెయ్యబోతున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా మొదలయ్యాయి. అదే విధంగా విజయవాడ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చెయ్యబోతున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని.

    ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘దేవర’ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ అయ్యి ఆయనకీ లాభాల వర్షం కురిపించింది. అయితే నాగ వంశీ త్వరలో విజయవాడ లో నిర్వహించబోయే ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట. ఎట్టి పరిస్థితిలో బాబాయ్, అబ్బాయి ని ఒకే స్టేజి మీదకి తీసుకొని రావాలని ఆయన చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. గత కొన్నేళ్ల నుండి ఎన్టీఆర్, బాలయ్య ఒకే వేదికపై కనిపించలేదు. ఎన్టీఆర్ కూడా టీడీపీ కి, బాలయ్య కుటుంబానికి చాలా దూరంగా ఉంటున్నాడని మీడియా లో ఒక రేంజ్ ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యినప్పుడు కూడా ఎన్టీఆర్ ఆయన్ని చూసేందుకు రాకపోవడంతో టీడీపీ అభిమానులు కూడా ఆయన పై కోపం తో ఉన్నారు.

    ఇలాంటి సంఘటనలన్నీ జరగడంతో ఎన్టీఆర్ నందమూరి కుటుంబీకులతో శాశ్వతంగా దూరమైపోయాడు అని మీడియా కథనాలు ప్రచారం అయ్యాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని, మేమంతా ఒకే కుటుంబం అని, మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు అని చెప్పే విధంగా వీళ్లిద్దరి కలిస్తే ఉంటుందని, అందులో భాగంగా నాగవంశీ ఈ ప్రయత్నం చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే నందమూరి అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘డాకు మహారాజ్’ మూవీ హైప్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతాది. మరి నిజంగానే ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి వస్తాడా లేదా అనేది చూడాలి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది చెప్పేది ఏమిటంటే ఈ ఈవెంట్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.