spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Host: 'బిగ్ బాస్' హోస్ట్ గా టీం ఇండియా కెప్టెన్.. ఇది మామూలు...

Bigg Boss Host: ‘బిగ్ బాస్’ హోస్ట్ గా టీం ఇండియా కెప్టెన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు బాబోయ్..

Bigg Boss Host: దేశవ్యాప్తంగా వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు చూసే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రియాలిటీ షో ‘బిగ్ బ్రదర్’ అనే పేరుతో బాగా పాపులర్ అయ్యింది. ఈ కాన్సెప్ట్ ని ఎండమోల్ షైన్ సంస్థకు బాగా నచ్చడం తో ఇండియా లో కూడా ఈ షోస్ ని నిర్వహించడం మొదలు పెట్టారు. ముందుగా హిందీ లో సల్మాన్ ఖాన్ తో ప్రారంభించారు , రెస్పాన్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చింది. ఇక ఆ తర్వాత కన్నడ , తెలుగు , మలయాళం, తమిళ భాషల్లో మొదలు పెట్టారు. అన్నిట్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ఈ రియాలిటీ షో కి బ్రహ్మరథం పట్టారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఈ రియాలిటీ షో మొదలైంది. ఆ తర్వాత రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.

ఇక మూడవ సీజన్ నుండి త్వరలో మొదలయ్యే 10 వ సీజన్ వరకు నాగార్జున నే హోస్ట్. అదే విధంగా తమిళం లో కమల్ హాసన్ 7 సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించారు. గత రెండు సీజన్స్ నుండి విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక హిందీ లో అయితే మొదటి నుండి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తుండగా , మలయాళం వెర్షన్ కి మోహన్ లాల్ , కన్నడ వెర్షన్ కి సుదీప్ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి తెలుగుతో పాటు హిందీ , తమిళం , కన్నడ , మలయాళం , బంగ్లా భాషల్లో ఒకేసారి ప్రారంభించబోతున్నారు అట. ఈ విషయాన్ని స్వయంగా జియో హాట్ స్టార్ సంస్థ అధికారికంగా తెలిపింది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బంగ్లా వెర్షన్ కి ప్రముఖ మాజీ ఇండియన్ కెప్టెన్ , క్రికెట్ దిగ్గజం గంగూలీ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటి వరకు సినీ తారలే హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చారు , మొట్టమొదటిసారి ఒక లెజండరీ క్రికెటర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎంతో మంది దిగ్గజాలు ఉన్న టీం ఇండియా ని విజయవంతంగా నడిపించడమే కాకుండా, కోచ్ గా కూడా గంగూలీ ఎనలేని సేవలు అందించారు. అలాంటి లెజెండ్ 20 మంది కంటెస్టెంట్స్ ఉండే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ని ఎలా నడిపిస్తారో చూడాలి. ఒకేసారి అన్ని భాషల్లో లాంచ్ అవుతుంది కాబట్టి , 500 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని ఈ రియాలిటీ షో కి ఆశిస్తున్నారు జియో హాట్ స్టార్ సంస్థ.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
SKN Producer

SKN Producer: యంగ్ హీరోయిన్ కి దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన నిర్మాత SKN ..పాపం పరువు పోయిందిగా..

SKN Producer: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్...
Oktelugu Epaper