https://oktelugu.com/

Teachers’ Day Special: గురువుల రోజున “గురూజీ” గురించి !

Teachers’ Day Special: నేటి తెలుగు యువత ప్రేమగా “గురూజీ” అని పిలుచుకునే వ్యక్తి.. ‘త్రివిక్రమ్’. సినిమాల్లో కూడా విలువైన మాటలు చెప్పి, యువతకు సరైన మార్గం చూపిస్తోన్న ఈ మాటల మాస్టర్ చెప్పిన విలువైన ఆణిముత్యాల్లాంటి సూక్తులు ఎన్నో ఉన్నాయి. అసలు గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చినా యువత పట్టించుకోరు. అలాంటిది కేవలం ఒక మాటతో ‘అబ్బ’ ఏం చెప్పాడురా’ అని ఒక్క చిన్న మాటలోనే గొప్ప విలువలు చెప్పగల నేర్పు ఈ గురువు సొంతం. […]

Written By:
  • admin
  • , Updated On : September 5, 2021 / 03:54 PM IST
    Follow us on

    Teachers’ Day Special: నేటి తెలుగు యువత ప్రేమగా “గురూజీ” అని పిలుచుకునే వ్యక్తి.. ‘త్రివిక్రమ్’. సినిమాల్లో కూడా విలువైన మాటలు చెప్పి, యువతకు సరైన మార్గం చూపిస్తోన్న ఈ మాటల మాస్టర్ చెప్పిన విలువైన ఆణిముత్యాల్లాంటి సూక్తులు ఎన్నో ఉన్నాయి. అసలు గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చినా యువత పట్టించుకోరు. అలాంటిది కేవలం ఒక మాటతో ‘అబ్బ’ ఏం చెప్పాడురా’ అని ఒక్క చిన్న మాటలోనే గొప్ప విలువలు చెప్పగల నేర్పు ఈ గురువు సొంతం.

    ఉదాహరణకు “అతడు” సినిమాలో ఓ సన్నివేశం.. హీరో గన్ పట్టుకొని విలన్ ను చంపడానికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ వచ్చి “నేను వస్తాను” అంటుంది. అక్కడ ఆమెకు తన ప్రియుడు మీద ఎంత ప్రేమ ఉంది అనేది ఆ ఒక్క మాటతోనే అర్థమవుతుంది. అతను వెళ్తుంది యుద్దానికి అని తెలిసినా.. చివరి వరకు నీతోనే ఉంటాను అని ఒక్క మాటలోనే చెప్పించాడు.

    దానికి సమాధానం గా హీరో “నేనే వస్తాను” అని చెప్తాడు. ఇక్కడ హీరో ఉద్దేశం, గతాన్ని వదిలేసి తను కోరుకున్న జీవితం కోసం తానే యుద్ధం గెలిచి వస్తాను అన్న భావాన్ని “నేనే వస్తాను” అన్న చిన్న మాటలో చెప్పడం ఒక్క గురూజీకే సాధ్యం. అలాగే త్రివిక్రమ్ లో ఉన్న మరో గొప్పతనం.. చిన్న చిన్న పదాలతో సన్నివేశాలని సృష్టించగలడం.

    త్రివిక్రమ్ తెలుగు భాషలో ఉన్న హ్యూమర్ ను ఎక్కువగా వాడుకున్నారు. తెలుగు భాష ఇంత సరదా సరదాగా ఉంటుందా అని అనుకునేలా కొన్ని రాశారు. ఈ తరం వాళ్ళు ఈ మాత్రం అన్నా తెలుగు మాట్లాడుతున్నారు అంటే అందులో త్రివిక్రమ్ పాత్ర ఉంది అనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.