Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 5 : బిగ్ బాస్ ఆరంభోత్స‌వం.. డ‌బ్బులు పార‌బోస్తున్నార‌ట‌గా..! ఖ‌ర్చు ఎంతో...

Bigg Boss Telugu 5 : బిగ్ బాస్ ఆరంభోత్స‌వం.. డ‌బ్బులు పార‌బోస్తున్నార‌ట‌గా..! ఖ‌ర్చు ఎంతో తెలుసా?

Bigg Boss Telugu 5 : ఇప్పుడు తెలుగు ఆడియ‌న్స్ క‌ళ్ల‌న్నీ గ‌డియారం మీద‌నే ఉన్నాయి. సాయంత్రం 6 గంట‌లు ఎప్పుడు కొడుతుందా? బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఎదురు చూస్తున్నారు. కంటిస్టెంట్స్ ఎవ‌రొస్తారు? వారి రెమ్యునరేషన్ ఎంత? టైటిల్ ఫేవరెట్ ఎవరు? అంటూ.. జోరుగా డిస్క‌ష‌న్స్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే.. నాలుగో సీజ‌న్ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ కావ‌డంతో.. ఐదో సీజ‌న్ ఎలా మొద‌లు కానుంద‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. ఎవ్వ‌రినీ డిజ‌ప్పాయింట్ చేయ‌కుండా.. భారీగా ఖ‌ర్చు చేసి ర‌చ్చ ర‌చ్చ‌ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ప‌లువురు కంటిస్టెంట్ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. హీరోయిన్ ఇషా చావ్లా, న‌టీమ‌ణులు శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, ల‌హ‌రి షారి, యాంక‌ర్లు ర‌వి, వ‌ర్షిణి, జ‌బ‌ర్ధ‌స్త్ ప్రియాంక‌, సిరి హ‌న్మంతు, సింగ‌ర్ రామ చంద్ర‌, దీప‌క్ స‌రోజ‌, 7ఆర్ట్స్ స‌ర‌యు, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, టీవీ యాక్ట‌ర్లు స‌న్నీ, మాన‌స్ షా, కార్తీక దీపం ఫేమ్ ఉమాదేవీ, మోడ‌ల్ జ‌శ్వంత్‌, ఆర్జే కాజ‌ల్‌, ల‌మ‌రి షారి, యూట్యూబ‌ర్ లోబో వంటివారు ఉన్నారు. వీరిలో కొంద‌రిని స్టాండ్ బైగా కూడా ఉంచిన‌ట్టుగా తెలుస్తోంది. మొత్తం 19 మంది హౌస్ లో అడుగుపెడ‌తార‌ని టాక్‌.

అయితే.. నాలుగో సీజ‌న్ తో పోలిస్తే.. ఇందులో ఉన్న కంటిస్టెంట్లు చాలా మందికి తెలిసిన వారే. దీనికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. గ‌త సీజ‌న్లో వ‌చ్చిన‌ కంటిస్టెంట్ల‌లో ఇద్ద‌రు ముగ్గురు మిన‌హా.. మిగిలిన వారంతా ఎవ‌రో తెలియ‌దు. వారంతా.. బిగ్ బాస్ హౌస్ లోకి వ‌చ్చిన త‌ర్వాత‌నే ఫేమ‌స్ అయ్యారు. దీంతో.. సెల‌బ్రిటీ షోకు.. ఎక్క‌డెక్క‌డి నుంచి ఎవ‌రినో తెచ్చార‌ని, త‌క్కువ ఖ‌ర్చుతో ముగించేందుకే ఇలా చేశార‌నే కంప్లైంట్లు భారీగానే వ‌చ్చాయి. దీన్ని దృష్టి పెట్టుకొని, ఈ సారి చాలా వ‌ర‌కు జ‌నాల‌కు తెలిసిన వారినే తీసుకొస్తున్న‌ట్టు స‌మాచారం.

రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ ఈసారి ఉదారంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టుగా తెలుస్తోంది. కంటిస్టెంట్ల రేంజ్ ను బ‌ట్టి కొంద‌రు సెల‌బ్రిటీల‌కు వారానికి 12 నుంచి 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్తున్న‌ట్టు స‌మాచారం. యూట్యూబ్ స్టార్లు, సినిమా, టీవీ న‌టుల‌తోపాటు ఓ జ‌ర్న‌లిస్టు కూడా ఎంట్రీ ఇస్తార‌ని తెలుస్తోంది. మొత్తానికి చాలా మంది జ‌నాల‌కు ముఖ ప‌రిచ‌యం ఉన్న‌వారే ఈ సారి గేమ్ ఆడ‌బోతున్నార‌ని టాక్‌. అయితే.. యాంక‌ర్ ర‌వి, ష‌ణ్ముక్ జ‌శ్వంత్ పైనే అంద‌రి గురి ఉండే అవ‌కాశం ఉంది.

ఈ ఊహాగానాల మ‌ధ్య షోను గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు నిర్వాహ‌కులు. అయితే.. ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ఈజ్ బెస్ట్‌.. అన్న‌ట్టుగా ఓపెనింగ్ ఈవెంట్ ను భారీగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం ఏకంగా 3 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు వినికిడి. మ‌రి, అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగనున్న ప్రారంభోత్స‌వం ఏ విధంగా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version