https://oktelugu.com/

BiggBoss Telugu 5 contestants : బిగ్ బాస్ లో ట్విస్ట్.. పలువురి పేర్లు గల్లంతు.. వీరేనా?

BiggBoss Telugu 5 contestants:  తెలుగులోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మొదలైంది. ఆదివారం ప్రసారం కానున్న బిగ్ బాస్ షోను శనివారం షూటింగ్ పూర్తి చేశారు. 5వ సీజన్ ఘనంగా ప్రారంభమైనట్టు తెలిసింది. స్టార్ మా చానెల్ ఈరోజు షూటింగ్ ను నిర్వహించి హౌస్ లోకి కంటెస్టెంట్లను పంపినట్లు తెలిసింది. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి. రేపు సెప్టెంబర్ 5న బిగ్ బాస్ అధికారికంగా మొదలు కానుంది. అయితే ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2021 / 03:54 PM IST
    Follow us on

    BiggBoss Telugu 5 contestants:  తెలుగులోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మొదలైంది. ఆదివారం ప్రసారం కానున్న బిగ్ బాస్ షోను శనివారం షూటింగ్ పూర్తి చేశారు. 5వ సీజన్ ఘనంగా ప్రారంభమైనట్టు తెలిసింది. స్టార్ మా చానెల్ ఈరోజు షూటింగ్ ను నిర్వహించి హౌస్ లోకి కంటెస్టెంట్లను పంపినట్లు తెలిసింది. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి.

    రేపు సెప్టెంబర్ 5న బిగ్ బాస్ అధికారికంగా మొదలు కానుంది. అయితే ఈ షూటింగ్ శనివారం పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం ద్విగిజయంగా కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున పంపారు. ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా నిర్వహించినట్టు తెలిసింది.

    కొద్దిరోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్లను తాజ్ డెక్కన్, మారియట్ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న పార్టిసిపెంట్లను ప్రస్తుతం హౌస్ లోకి ప్రవేశపెడుతున్నారు. ఈ సాయంత్రానికి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ పూర్తి కానుంది. ఇక రోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ ప్రసారం కానుంది. ఇక ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చేసింది.

    అయితే ఇది వరకు లీక్ అయిన జాబితాలో కొంతమంది పేర్లు గల్లంతు అయినట్టుగా సమాచారం. యాంకర్ రవితోపాటు కొంతమంది కొత్త వారు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.

    *బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్లే..
    -యాంకర్ రవి
    శ్వేత వర్మ
    వీజే సన్ని
    యూట్యూబర్ సరయు (7 ఆర్ట్స్)
    యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్
    లేడి కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్
    ట్రాన్స్ జెండర్ కం జబర్ధస్త్ కమెడియన్ ప్రియాంక (సాయితేజ)
    యాక్టర్ విశ్వ
    డ్యాన్స్ మాస్టర్ నటరాజ్
    తెలుగు టీవీ యాక్టర్ మానస్
    కార్తీకదీపం సీరియల్ నటి భాగ్య( ఉమాదేవి)
    సినీ జర్నటిస్ట్ ఆర్జే కాజల్
    సింగర్ రామచంద్ర
    నటి సిరి హన్మంతు
    నటి ప్రియ
    కమెడియన్ లోబో