https://oktelugu.com/

Ram Charan: స్విట్జర్లాండ్‌లో సేద తీరుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” సినిమా తర్వాత ఆయన ఆచార్య, #RC15 వంటి సినిమా షూటింగ్ లలో  బిజీ గా  అయి పోయారు. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” నుండి విడుదలైన పోస్టర్స్ టీజర్, పాటలు ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ను పెంచాయనే చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న  “ఆచార్య” టీజర్ విడుదలైన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 07:31 PM IST
    Follow us on

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” సినిమా తర్వాత ఆయన ఆచార్య, #RC15 వంటి సినిమా షూటింగ్ లలో  బిజీ గా  అయి పోయారు. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” నుండి విడుదలైన పోస్టర్స్ టీజర్, పాటలు ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ను పెంచాయనే చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న  “ఆచార్య” టీజర్ విడుదలైన చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ లో తండ్రి, కొడుకులు తమ నటనతో అభిమానుల అంచనాలను పెంచారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఇన్ని భారీ చిత్రాల తర్వాత చెర్రీకి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనిపించిందేమో ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్‌ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

    వరుస సినిమాలు తర్వాత కాస్త విశ్రాంతి సమయాన్ని కుదుర్చుకున్నారు చరణ్. అందుకే సరదాగా స్విట్జర్లాండ్‌లో వాలిపోయారు. తన సోదరితో కలిసి ఆయన విహారయాత్రకు వెళ్లారు. కొన్ని రోజులు అక్కడ సెలవుల్ని ఆస్వాదించి, ఇండియా వస్తారు. వచ్చాక… “ఆర్‌.ఆర్‌.ఆర్‌ ” ప్రమోషన్లు లో బిజీ అయిపోతారు అని సమాచారం. అయితే ఇటీవల ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీ తో ప్యారిస్ వెకేషన్ లో ఎంజాయ్ చేసి వచ్చారు. అందుకు సంబంధించిన  ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ తన సోదరితో విహార యాత్రలో సేద తీరుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.