Tarakaratna Health: తారకరత్న కోలుకుని తిరిగి రావాలని లక్షల మంది ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు ఆయన పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. అదే సమయంలో తెరపైకి వస్తున్న పలు నిరాధార కథనాలు అయోమయానికి గురి చేస్తున్నాయి. తారకరత్న కోలుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా తారకరత్న ప్రధాన అవయవాల పనితీరు మెరుగవుతుంది. వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు. దీంతో తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడతారని అభిమానులు భావించారు.

అయితే సోమవారం సాయంత్రం నారాయణ హృదయాలయ వైద్యులు మరో బులెటిన్ విడుదల చేశారు. తాకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్ తో పాటు లైఫ్ ఇతర లైఫ్ సప్పోర్ట్ సిస్టమ్స్ అమర్చడం జరిగింది. ఎక్మో చికిత్స జరగలేదు. తారకరత్న హెల్త్ పై కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. వైద్యులమైన మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి… అని హెల్త్ బులెటిన్ లో పొందుపరిచారు. తారకరత్న కోలుకుంటున్నారన్న వాదనలను డాక్టర్స్ పరోక్షంగా ఖండించారు.
నేడు లేదా రేపు తారకరత్న కండీషన్ పై పూర్తి స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఐసీయూ విభాగంలో బెడ్ పై తారకరత్న ఫోటో లీకైంది. వెంటిలేటర్ అమర్చి చలనం లేకుండా పడి ఉన్న తారకరత్నను చూస్తుంటే హృదయం ద్రవించింది. తారకరత్నను ఆ స్థితిలో చూసిన అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయన దేవుని కృపతో కోలుకుని తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. చికిత్స జరుగుతున్న ఆసుపత్రిలోకి మీడియాకు, ఇతరులకు అనుమతి లేదు. దీంతో స్పష్టమైన సమాచారం బయటకు రావడం లేదు.

ఎట్టకేలకు తారకరత్న ఐసీయూలో ఉన్న ఫోటో ఒకటి లీకైంది. పరిశ్రమలో తారకరత్నకు అజాత శత్రువుగా పేరుంది. అందరితో మంచిగా ఉండే ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరినీ కించపరుస్తూ తారకరత్న మాట్లాడిన దాఖలాలు లేవు. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నట్లు ఇటీవల ప్రకటించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తారకరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 27న యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురయ్యారు.