Taraka Ratna: నందమూరి తారకరత్న అకాల మరణం అభిమానులకు లోటే. ఆయన చనిపోయి ఏడాది గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలను మాత్రం అభిమానులు మరువలేక పోతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్న జ్ఞాపకాలతో గడిపేస్తున్నారు. తారకరత్న జన్మదినం ఫిబ్రవరి 22 కాగా.. ఫిబ్రవరి 18న ఆయన చనిపోయారు.ఆయన ప్రధమ వర్ధంతి సందర్భంగా భార్య అలేఖ్య రెడ్డికి చెందిన ఎమోషనల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తారకరత్న, అలేఖ్య రెడ్డిది ప్రేమ వివాహం. 2012లో వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తారకరత్న మంచి మనసున్న మనిషి. సినిమా రంగంలో అడుగుపెట్టినా అనుకున్నంత సక్సెస్ దక్కలేదు. అందుకే రాజకీయాల వైపు నడవాలని భావించారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పని చేశారు. లోకేష్ పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు. కొద్దిరోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన అకాల మరణంతో నందమూరి అభిమానులు షాక్ కు గురయ్యారు.
తారకరత్న ప్రథమ జయంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ కు గురయ్యారు. భర్త తారకరత్న ఫోటోకు అలేఖ్య రెడ్డి ముద్దు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజెన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. తారకరత్నకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి కుటుంబానికి ఆర్థికంగా బాలకృష్ణ అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ముగ్గురు పిల్లల కెరీర్ పైనేఫోకస్ పెట్టినట్లు సమాచారం.