Site icon OkTelugu

Anupama Parameshwar: పరువు తీసిన అనుపమ.. చెప్పి మరీ ఆ పనిచేసింది..

Anupama Parameshwaran

Anupama Parameshwaran

Anupama Parameshwar: టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ గురించి తెలియని వారుండరు. ఫస్ట్ మూవీ ‘అ..ఆ..’తోనే ఈమె ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో నటించినా అనుపమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాల్లో తక్కువగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుందీ బ్యూటీ. లేటేస్టుగా ఈ సుందరి నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో సెరైన్ లో తన నటనతో ఆకట్టుకుంది. అయితే సెరైన్ లో అనుపమది డిఫరెంట్ పాత్ర. దీనిపై కొందరు రివ్యూ రాశారు. ఆ రివ్యూపై అనుమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి పరువు తీసేసింది.

అనుపమ నటించిన సెరైన్ మూవీ ఇటీవల రిలీజ్ అయింది. అయితే ఈ మూవీపై ఓ వెబ్ సైట్ రివ్యూ రాసింది. వాస్తానికి అనుపమ సెరై్ సినిమాలో మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో నటించింది. దీంతో ఈమెకు సినిమాలో ఎక్కడా డైలాగ్ చెప్పే అవకాశం లేదు. అయినా ఓ వెవ్ సైట్ లో తనకు ఒక్క డైలాగ్ కూడా ఇవ్వలేదని అన్నారు. మిగతా పాత్రల కంటే అనుపమ పాత్రకు అన్యాయం చేశారని అన్నట్లు రివ్యూ రాశారు.

దీనిపై అనుపమ స్పందించారు. వెబ్ సైట్ లో ఇలా పిచ్చ పిచ్చిగా ఎలా రాస్తారు? అని మండిపడ్డారు. మీరు ఓ మూగ, చెవిటి పాత్ర నుంచి కూడా డైలాగ్స్ ఆశిస్తున్నారా? గ్రేట్ అని కౌంటర్లు వేసింది. ఈ మేరకు ఆ వెబ్ సైట్ తో చేసిన చాట్ ను, వెబ్ సైట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి దానిని అనుపమ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. ఈ పోస్టును చూసి అనుపమ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అయితే అనుపమ స్పందనపై వెబ్ సైట్ నిర్వాహకులు ఎడిట్ చేయిస్తామని బదులిచ్చారు. కానీ అయినా అనుమప ఒప్పుకోలేదు. సెరైన్ తో పాటుఅనుపమ రవితేజ నటించిన ఈగల్ సినిమాలో కూడా నటించింది. ఇందులో ఆమెది రెండో హీరోయిన్ పాత్ర. అయితే సెరైన్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Exit mobile version