YCP: ఏపీలో రాజకీయాలు నోటిఫికేషన్ రాకముందే వేడెక్కాయి. పరస్పర ఆరోపణలతో రాజకీయ నాయకులు ఎన్నికల వాతావరణాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు. పోటా పోటీగా సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. శంఖారావం, రా కదిలి రా అని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల సభలు నిర్వహిస్తుంటే.. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు జరుపుతున్నారు. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో తన ప్రభుత్వ హయాంలో చేసిన పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల కూడా సభలు, సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
కేవలం సభలు, సమావేశాల ద్వారా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తుంటే.. రాజకీయ పార్టీల అనుచరులు కొందరు సోషల్ మీడియాను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇటీవల బహుళ ప్రాచుర్యం పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన కొన్ని వీడియోలను ప్రతిపక్ష పార్టీల మీద వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. అలా వైసిపి అనుకూల సోషల్ మీడియా విభాగం రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. ఈ వీడియోను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా.. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా రూపొందించడంతో వైసిపి అనుకూల సోషల్ మీడియా హ్యాండ్లర్స్ దీనిని తెగ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇలా ప్రచారం చేయడానికి జనాల్లో బాగా ఆదరణ పొందిన కొన్ని పాటలను ఉపయోగించుకుంటున్నారు. అలా ఇటీవల కొంతమంది స్కూల్ పిల్లలు చేసిన ఒక వీడియో మనదేశంలో బహుళ ప్రాచుర్యం పొందింది. కొంతమంది పిల్లలు ఒకే వరుసలో ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క పండుగ సంబంధించిన ఉపయోగాన్ని ఇంగ్లీషులో పాట రూపంలో వివరించారు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాను తెగ షేక్ చేసింది. అయితే ఆ పిల్లల ముఖాలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఏపీలోని ప్రతిపక్ష నాయకుల ముఖాల మాదిరి రూపొందించారు. అలా ఒకరి వెంట ఒకరు వచ్చి.. ఓటర్లను మభ్యపెడుతున్నారు అన్నట్టుగా వీడియోను మార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి దీనికి కౌంటర్ గా టిడిపి ఎలాంటి వీడియో రూపొందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
అరేయ్ @YSRCParty @ysrcpitwingoff pic.twitter.com/P3uzw5NVR1
— Akshay (@AkshayBRS) February 22, 2024