https://oktelugu.com/

తాప్సి మరో ప్రయోగం.. ‘మిషన్ ఇంపాజిబుల్’

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అనంతరం దక్షిణాది సినిమాలన్నింటిలోనూ నటించి మెప్పిస్తున్న హీరోయిన్ తాప్సి దేశవ్యాప్తంగా మంచి నటిగా గుర్తింపు పొందింది. సీరియస్, నవల కథలు, యాథార్థ ఘటనలతో రూపొందించే సినిమాల్లో నటిస్తూ తనకంటూ తాప్సి క్రేజ్ సంపాదించుకుంది. ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత ఆమె తెలుగులో ఒక్క సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సినిమాల్లో బిజీగా ఉంది. నాలుగు సంవత్సరాల తర్వాత ‘మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ ఆధ్వర్యంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస […]

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2021 / 03:33 PM IST
    Follow us on

    టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అనంతరం దక్షిణాది సినిమాలన్నింటిలోనూ నటించి మెప్పిస్తున్న హీరోయిన్ తాప్సి దేశవ్యాప్తంగా మంచి నటిగా గుర్తింపు పొందింది. సీరియస్, నవల కథలు, యాథార్థ ఘటనలతో రూపొందించే సినిమాల్లో నటిస్తూ తనకంటూ తాప్సి క్రేజ్ సంపాదించుకుంది.

    ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత ఆమె తెలుగులో ఒక్క సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సినిమాల్లో బిజీగా ఉంది.

    నాలుగు సంవత్సరాల తర్వాత ‘మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ ఆధ్వర్యంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లాంటి హిట్ మూవీ తీసిన దర్శకుడు స్వరూప్ దర్శకత్వంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే సినిమాను తెలుగులో ఒప్పుకుంది తాప్సీ. ఈరోజు షూటింగ్లో తాప్సీ పాల్గొంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఆమె వర్కింగ్ స్టిల్ ను విడుదల చేశారు.

    ఈ ఫొటోలో విరిగిన చేతికి కట్టు కట్టుకొని తాప్సీ సీరియస్ గా ల్యాప్ టాప్ లో చూస్తూ కనిపించింది. ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగానే ఆమె ముఖ కవలికలున్నాయి.

    ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా తాప్సి నటిస్తోంది. ఆమె టాలీవుడ్ లోకి తిరిగి రావడానికి సంతృప్తిగా ఉంది. ప్రస్తుతం తాప్సీ చేతిలో సినిమాలు ఏవీ లేవు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ లోనే పాల్గొంటోంది.

    తిరుపతి సమీపంలోని ఒక గ్రామంలో అమర్చిన బౌంటి హంటింగ్ ఆధారంగా ఈ కథ రూపొందించారు. కామెడీ డ్రామాగా తీస్తున్న చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు.