Tanuja: తెలుగు బిగ్ బాస్ సీజన్ లోనే కాదు, ఇతర భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ లో కూడా విన్నర్, రన్నర్ రేస్ కేవలం శత్రువుల మధ్యలోనే ఉంటుంది. గత సీజన్ లో విన్నర్ గా నిల్చిన నిఖిల్, రన్నర్ గా నిల్చిన గౌతమ్ మధ్య ఏ రేంజ్ లో గొడవలు జరిగేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఛాన్స్ దొరికితే ఇద్దరు కొట్టుకునే రేంజ్ కి వెళ్ళిపోయేవారు. అదే విధంగా సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమర్ దీప్ మధ్య ఏ రేంజ్ గొడవలు జరిగేవో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. బయటకు వచ్చిన తర్వాత అమర్ దీప్ కారు పై దాడి కూడా జరిగింది. ఇలా మొదటి సీజన్ నుండి విన్నర్ , రన్నర్ రేస్ ఫార్ములా ఇదే. కానీ చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్(Bigg Boss 9 Telugu) లో ఇద్దరు స్నేహితులు విన్నర్ గా, రన్నర్ గా నిలిచారు.
12 వ వారం వరకు తిరుగులేని ఆధిపత్యం తో నెంబర్ 1 స్థానం లో కొనసాగిన తనూజ ని , 13 వ వారం నుండి ఓటింగ్ లో పవన్ కళ్యాణ్ దాటేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చివరికి టైటిల్ విన్నర్ గా పవన్ కళ్యాణ్, రన్నర్ గా తనూజ నిలిచారు. మొదటి నుండి వీళ్లిద్దరు స్నేహంగానే ఉన్నారు కానీ , ఫ్యామిలీ వీక్ ముందు వారం నుండి మరింత స్నేహం గా ఉండడం మొదలు పెట్టారు. ఒకరి కోసం ఒకరు అండగా నిలబడుతూ గేమ్ ఆడుకుంటూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కంటే హౌస్ లో టైటిల్ విన్నర్ గా నిలబడడానికి చాలా మందికి అర్హత ఉంది. మూడవ వారం లోనే ఎలిమినేట్ అవ్వాల్సిన కుర్రాడు, ఒక స్ట్రాటజీ ప్రకారం తనూజ తో స్నేహం చేసి, ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకొని, చివర్లో సానుభూతి కార్డు వాడి గెలిచేసాడు అనేది తనూజ ఫ్యాన్స్ వాదన.
కేవలం తనూజ ఫ్యాన్స్ వాదన మాత్రమే కాదు, ఆమె కుటుంబ సభ్యులు,స్నేహితులు కూడా ఆమెకు అదే చెప్పినట్టు ఉన్నారు. అందుకే ఫినాలే ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరితో ప్రత్యేకంగా ఫోటోలు దిగిన తనూజ, పవన్ కళ్యాణ్ తో మాత్రం ఫోటోలు దిగలేదు. షో ముగిసిన తర్వాత తనూజ ని కళ్యాణ్ ప్రత్యేకంగా హోటల్ రూమ్ లో కలవడానికి కూడా ప్రయత్నం చేసాడు. కానీ ఆమె టీం అతన్ని కలవనివ్వలేదు. దీంతో సోషల్ మీడియా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే తనూజ తానూ అలా కలవకపోవడానికి కారణం కళ్యాణ్ బజ్ ఇంటర్వ్యూ కి వెళ్లిపోయాడని, నేను కాసేపు స్టేజి మీద ఫోటోలు దిగి, నా బజ్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని హోటల్ కి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే నిన్న లైవ్ లో అభిమానులతో మాట్లాడుతున్న తనూజ కు మధ్యలో ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ లో ఎవరో ఆమెకు కళ్యాణ్ గురించి మాట్లాడొద్దు అని చెప్పడాన్ని మనం గమనించొచ్చు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
తనూజ లైవ్లో ‘మిస్టరీ వాయిస్’ కలకలం: కళ్యాణ్ టాపిక్ వద్దంటూ ఫోన్ కాల్!
తనూజ ఇన్స్టా లైవ్లో ఉండగానే.. ఫోన్.. కళ్యాణ్ గురించి మాట్లాడొద్దని హింట్. ఆ కాల్ తర్వాత తనూజ ఒక్కసారిగా కంగారుపడి, చాలా ప్రశ్నలను దాటవేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో అసలు ఆ వాయిస్ ఎవరిది? తనూజను… pic.twitter.com/lt2cMroTv0
— ChotaNews App (@ChotaNewsApp) December 26, 2025