https://oktelugu.com/

Tangalan’ Movie Twitter Review : ఇలాంటి టాక్ నిజంగా మీరు ఊహించి ఉండరు!

హీరో విక్రమ్ ఈ చిత్రం గురించి చెప్పిన మాటలు అంచనాలను రెట్టింపు చేసాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వగా, ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : August 15, 2024 / 10:32 AM IST

    Tangalan' Movie Twitter Review

    Follow us on

    Tangalan’ Movie Twitter Review : నేటి తరం సౌత్ ఇండియన్ స్టార్స్ లో నటనలో వైవిధ్యాన్ని చూపే హీరోల లిస్ట్ తీస్తే అందులో చియాన్ విక్రమ్ కచ్చితంగా టాప్ లో ఉంటాడు. ఆయన చేసిన ప్రయోగాలు కొన్ని సక్సెస్ అయ్యాయి, కానీ ఎక్కువ శాతం ఫ్లాప్స్ అయ్యాయి. విక్రమ్ కమర్షియల్ చిత్రాలు తమిళనాడు బాక్స్ ఆఫీస్ లో ఒక సెన్సేషన్ సృష్టించేది. అయినప్పటికీ కూడా ఆయన నమ్ముకున్న ప్రయోగాత్మక మార్గంలోనే సినిమాలు చేస్తూ వచ్చాడు, ఇప్పటికీ అలాగే చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రముఖ దర్శకుడు పీఏ రంజిత్ దర్శకత్వం లో ఆయన ‘తంగలాన్’ అనే చిత్రం చేసాడు. విడుదలకు ముందు ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

     

    అంతే కాకుండా ప్రొమోషన్స్ లో హీరో విక్రమ్ ఈ చిత్రం గురించి చెప్పిన మాటలు అంచనాలను రెట్టింపు చేసాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వగా, ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చియాన్ విక్రమ్ నటన అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలతో ముంచి ఎత్తుతున్నారు. అసలు ఇలాంటి గెటప్ లో ఒక స్టార్ హీరో సినిమా ఒప్పుకోవడమే చాలా కష్టం, అలాంటిది విక్రమ్ ఒప్పుకొని ఇంత చక్కగా నటించడం అభినందనీయం అంటూ కొనియాడుతున్నారు. అలాగే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని అంటున్నారు. కథ రీత్యా స్క్రీన్ ప్లే చాలా వరకు నిదానంగానే ఉంటుందని, కానీ తీసుకున్న కథాంశం కారణంగా ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఆడియన్స్ స్పెషల్ సర్ప్రైజ్ ప్రముఖ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ విలన్ పాత్రలో నటించడమే. ఎంతో అందంగా కనిపించే ఆమెని గుర్తుపట్టలేని విధంగా మేకప్ వేసి డైరెక్టర్ రంజిత్ ఒక సరికొత్త ప్రయోగమే చేసాడని అంటున్నారు.

     

    అంతే కాకుండా ఆమెలో ఇంత యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయా అని ఈ సినిమా చూసిన తర్వాతే అర్థం అయ్యింది అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె హీరో విక్రమ్ తో పోటీ పడి నటించిందని, ఇది నిజంగా ఊహించలేదు అంటూ నెటిజెన్స్ చెప్తున్నారు. అయితే డైరెక్టర్ రంజిత్ ఐడియాలజీ కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చే విధంగా ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. సినిమాని సినిమాగా చూసేవారికి ఈ చిత్రం నచ్చుతుందని, సొంత ఐడియాలజీ తో ఉండేవారికి మాత్రం ఈ చిత్రం చిరాకు కలిగిస్తుందని అంటున్నారు. ఓవరాల్ గా అయితే ట్విట్టర్ లో ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరి ఈ రివ్యూస్ సినిమాని ఎంత వరకు తీసుకెళ్తుందో చూడాలి. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. ట్విట్టర్ లో ఈ సినిమాని చూసిన నెటిజెన్స్ ఏమన్నారో మీరే ఈ క్రింది రివ్యూస్ లో చూడండి.