https://oktelugu.com/

Double Smart’ Movie Twitter Review : పూరీ జగన్నాథ్ ఫామ్ లోకి వచ్చినట్టేనా..?

డబుల్ ఇస్మార్ట్ సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తుందని అనుకున్నారు కానీ, అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా ట్విట్టర్ లో యావరేజి టాక్ నడుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని నచ్చిన వారికి, ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది

Written By: , Updated On : August 15, 2024 / 10:19 AM IST
Double Smart' Movie Twitter Review

Double Smart' Movie Twitter Review

Follow us on

Double Smart’ Movie Twitter Review : పూరీ జగన్నాథ్ ఫామ్ లోకి వచ్చినట్టేనా..?వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరీ జగన్నాథ్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమాకి సీక్వెల్ గా ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయ్ దేవరకొండ తో లైగర్ లాంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ చిత్రాన్ని తీసి డైరెక్టర్ గా, నిర్మాతగా బాగా నష్టపోయిన పూరీ జగన్నాథ్ ఎలా అయినా హిట్ కొట్టాలి అనే కసితో ఈ చిత్రాన్ని చేసాడు. మొదటి భాగం అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి పాటలు. రెండవ భాగానికి కూడా పాటలే సినిమాపై అంచనాలు పెంచాయి. మణిశర్మ అందించిన బాణీలు ప్రేక్షకులను అలరించాయి. కానీ లైగర్ చిత్రం భారీ నష్టాలను మిగిల్చిన కారణంగా ఈ సినిమాకి అనేక ప్రాంతాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ సరిగా జరగలేదు.

 

అంతే కాకుండా ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో బయ్యర్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు. దీంతో పూరీ జగన్నాథ్ అనేక ప్రాంతాలలో సొంతంగా విడుదల చేసుకున్నాడు. అలా నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూద్దాం. ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తుందని అనుకున్నారు కానీ, అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా ట్విట్టర్ లో యావరేజి టాక్ నడుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని నచ్చిన వారికి, ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని అంటున్నారు. మధ్యలో కమెడియన్ అలీ ట్రాక్ చూసేందుకు చాలా చిరాకుగా అనిపించిందని కూడా అంటున్నారు. హీరో రామ్ ఎనెర్జిటిక్ పెర్ఫార్మన్స్, డ్యాన్స్ సినిమాకి ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. ఇక రామ్, సంజయ్ దత్ మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయని అంటున్నారు. టేకింగ్ విషయం లో పూరీ జగన్నాథ్ తన మార్క్ చూపించాడని, కానీ అక్కడక్కడా ఫిల్లర్ సన్నివేశాలను మాత్రం ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి అంటూ నెటిజెన్స్ చెప్తున్నారు. ఇకపోతే ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది, ‘డబుల్ ఇస్మార్ట్’ లో కూడా క్లైమాక్స్ బాగా వచ్చిందని, ట్విస్ట్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక పూరీ జగన్నాథ్ డైలాగ్స్ కూడా యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయట.


ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ హాట్ బ్యూటీ అందచందాలు, బోల్డ్ నటన యూత్ ఆడియన్స్ కి నచ్చేలా ఉన్నాయట. ఓవరాల్ గా చూసుకుంటే పూరీ జగన్నాథ్ మళ్ళీ ట్రాక్ లోకి ఈ సినిమా ద్వారా వచ్చాడని చెప్పలేము కానీ, ఆయన గత చిత్రం లైగర్ తో పోలిస్తే మాత్రం వంద రెట్లు బెటర్ అని అంటున్నారు చూసిన ఆడియన్స్ మొత్తం. సినిమా ఆడేందుకు ఈ మాత్రం టాక్ చాలు అని సోషల్ మీడియా లో రామ్ ఫ్యాన్స్ అంటున్నారు. ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఈ క్రింది ట్వీట్స్ లో మీరే చూడండి.