https://oktelugu.com/

Tandel : ‘తండేల్’ కి పెట్టిన బడ్జెట్ 80 కోట్లు..బిజినెస్ కేవలం 40 కోట్లకు జరిగింది..కానీ విడుదలకు ముందే భారీ లాభాలు..ఎలాగో తెలుసా!

అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా 'తండేల్'. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : February 4, 2025 / 04:42 PM IST
    Tandel

    Tandel

    Follow us on

    Tandel : అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘తండేల్’. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించాడు. బన్నీ వాసు ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించగా, చందు మొండేటి దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి ఒక సినిమాలో హీరోయిన్ గా చేసిందంటే కచ్చితంగా ఆ చిత్రానికి ప్రారంభ దశ నుండే మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆమె ఎంచుకునే కథలు అలా ఉంటాయి కాబట్టి. అంతే కాకుండా ‘అమరన్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సాయి పల్లవి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. సాంగ్స్, ట్రైలర్ కూడా క్లిక్ అవ్వడం వల్ల యూత్ ఆడియన్స్ లో ఒక స్టార్ హీరో సినిమాకి ఎలాంటి అంచనాలు ఏర్పడుతాయో, అలాంటి అంచనాలు ఈ చిత్రం పై ఏర్పడ్డాయి.

    కానీ నాగచైతన్య కి ఉన్నటువంటి లిమిటెడ్ మార్కెట్ కారణంగా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ నిర్మాతకు భారీ లాభాలు వచ్చాయి. ఎందుకంటే నా థియేట్రికల్ రైట్స్ కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి కాబట్టి. ఈమధ్య కాలంలో నిర్మాతలకు ఓటీటీ సంస్థ యాజమాన్యాలు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తున్నారు. సినిమా కచ్చితంగా హిట్ అవ్వుధి అనిపిస్తే ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేయడానికి అసలు వెనకాడడం లేదు. ‘తండేల్’ చిత్రానికి కూడా అదే జరిగింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని సుమారుగా 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. అంతే కాకుండా సాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ కలిపి మరో 30 కోట్లు అదనంగా వచ్చింది. మొత్తం మీద 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తే 110 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది అన్నమాట.

    అంతే కాకుండా థియేటర్స్ లో ఒకవేళ ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే మొదటి వారం లోనే 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 40 కోట్ల రూపాయలకు పైగా ఎంత వసూళ్లు వచ్చినా అందులో నిర్మాతలకు వాటా వెళ్తుంది. కాబట్టి ఎటు చూసుకున్న తమ బిజినెస్ సేఫ్ అన్నట్టుగా ఉన్నారు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘మగధీర’ తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే. చూడాలి మరి ఈ సంస్థ అదృష్టం ఎలా ఉంది అనేది. ఈ సినిమా కోసం నాగచైతన్య ఏ సినిమాకి పడనంత కష్టాన్ని పడ్డాడు. నెలల తరబడి ప్రాక్టీస్ చేస్తూ క్యారక్టర్ లో లీనం అయ్యేందుకు ఆయన పడిన తపన చూసి ఆశ్చర్యపోయాము అంటూ నిర్మాత బన్నీ వాసు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.