https://oktelugu.com/

Thandel Collections : తండేల్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..కొంప ముంచిన పైరసీ..టార్గెట్ అందుకోవడం కష్టమే!

ప్రాంతాల వారీగా మాత్రం ప్రస్తుతం నైజాం ప్రాంతంలో మాత్రమే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. త్వరలోనే సీడెడ్, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోనుంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకోవడం ప్రస్తుతానికి అసాధ్యమేనట. అక్కడ ఈ చిత్రానికి కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 8 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : February 13, 2025 / 08:13 PM IST
    Thandel Collections

    Thandel Collections

    Follow us on

    Thandel  Collections :  అక్కినేని నాగ చైతన్య(Akkineni Nagachaitanya) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్(Thandel Movie)’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ వసూళ్లను దక్కించుకొని మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది అక్కినేని ఫ్యామిలీ కి చాలా కాలం తర్వాత ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది కానీ, ప్రాంతాల వారీగా మాత్రం ప్రస్తుతం నైజాం ప్రాంతంలో మాత్రమే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. త్వరలోనే సీడెడ్, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోనుంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకోవడం ప్రస్తుతానికి అసాధ్యమేనట. అక్కడ ఈ చిత్రానికి కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 8 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంది.

    అవలీలగా 1 మిలియన్ మార్కుని అందుకోవాల్సిన నార్త్ అమెరికా లో కూడా ఈ చిత్రం ఇంకా 1 మిలియన్ గ్రాస్ ని అందుకోలేదు. పాజిటివ్ టాక్ తో డిజాస్టర్ పెర్ఫార్మన్స్ ని సొంతం చేసుకున్న ఏకైక ప్రాంతం ఇదే. ఇక మిగిలిన ప్రాంతాల్లో మొదటి వారం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా ఈ స్టోరీ లో చూద్దాము. నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి మొదటి వారంలో 14 కోట్ల 50 లక్షల రూపాయిలు రాగా, సీడెడ్ ప్రాంతం లో 4 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో 4 కోట్ల 80 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్ల 46 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అదే విధంగా గుంటూరు జిల్లాలో కోటి 94 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, కృష్ణ జిల్లాలో కోటి 85 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.

    ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 33 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 53 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 3 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ వసూళ్లు అయినప్పటికీ, పెరిగిన మార్కెట్ కి కాస్త తక్కువ పెర్ఫార్మన్స్ ఇస్తుంది అనే చెప్పాలి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల షేర్ కి మించి వసూళ్లను చూడలేం, గ్రాస్ వసూళ్లు వంద కోట్ల రావడం కూడా కష్టమే.