Samyukta Menon : మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సంయుక్త మీనన్(Samyukta Menon) పేరు ముందు వరుసలో ఉంటుంది. మలయాళం లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె, తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘భీమ్లా నాయక్’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచమైంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఈ చిత్రం తర్వాత ఆమె చేసిన ‘బింభిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. విరూపాక్ష చిత్రం లో నెగటివ్ రోల్స్ కూడా చేయగలనని నిరూపించి చూపించింది. అయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందుకోకుండా, కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేసేందుకు ఈమె ఎక్కువగా మొగ్గు చూపిస్తుంది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన లైఫ్ స్టైల్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు పెద్దగా చెడు అలవాట్లు లేవు కానీ, వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త వైన్ తీసుకుంటాను. వైన్ తీసుకోవడం వల్ల నాకు కాస్త రిలాక్స్ దొరుకుతుంది. ఇది నా లైఫ్ స్టైల్ కారణంగా అలవాటు అయ్యింది. ప్రతీ ఒక్కరికి లైఫ్ స్టైల్ కారణంగా కొన్ని కొత్త అలవాట్లు పుడుతుంటాయి. నాకు ఈ అలవాటు మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చింది. ముందు ఒక మాట, వెనుక ఒక మాట మాట్లాడే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో, ఇలా నిజాలను నిర్భయంగా ఒప్పుకోవడం కేవలం సంయుక్త మీనన్ కి చెందింది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే సంయుక్త మీనన్ చివరిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘డెవిల్’. ఈ సినిమా తర్వాత ఆమె ‘లవ్ మీ – ఇఫ్ యూ డేర్’ అనే చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. గత రెండేళ్ల నుండి ఆమె నిఖిల్ హీరో గా నటిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘స్వయంభు’ లో ఒక హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె శర్వానంద్ తో కలిసి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ రెండు చిత్రాలతో పాటు ఆమె మలయాళం లో మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు సంతకం చేసింది. ఇలా కేవలం నటనకు ప్రాధాన్యత ఇస్తూ, సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.