Tandel : నాగచైతన్య (Naga Chaithanya) హీరోగా చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వంలో అల్లు అరవింద్ (Allu Aravind) ప్రొడ్యూసర్ గా వస్తున్న సినిమా తండేల్ (Thandel) సినిమా ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అందులో భాగంగానే సినిమా యూనిట్ ఇప్పటికే భారీ రేంజ్ లో ప్రమోషన్స్ ని చేపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి హిందీ ట్రైలర్ రిలీజ్ కోసం ముంబై వెళ్ళిన సినిమా యూనిట్ అక్కడ ఒక ఈవెంట్ ను కండక్ట్ చేశారు. అందులో భాగంగానే ఈ ట్రైలర్ ఈవెంట్ కి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అయిన ‘అమీర్ ఖాన్’ (అమీర్ Khan) ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ అమీర్ ఖాన్ తో మేము చేసిన ‘గజిని’ (Gajini) cinima భారీ విజయాన్ని సాధించి 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది నిజానికి సినిమా రిలీజ్ కంటే ముందే అమీర్ ఖాన్ మాతో ఇది 100 కోట్లు కలెక్షన్స్ ని రాబడుతుందని చెప్పాడు. తను చెప్పినట్టుగానే సినిమా 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి మొట్టమొదటిసారి 100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి భారతీయ చిత్రంగా కూడా ఈ సినిమా నిలిచింది అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన అమీర్ ఖాన్ తో గజిని 2 (Gajini 2) సినిమాని కూడా తెరకెక్కించడానికి మేము ప్రణాళికల రూపొందిస్తున్నామంటూ చెప్పాడు. అలాగే 1000 కోట్ల కలెక్షన్స్ ని గజిని 2 రాబడుతుంది అంటూ ఆయన చెప్పడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా రీసెంట్ గా సూర్య కూడా ‘గజిని 2’ సినిమా ఉంటుందని హింట్ ఇచ్చాడు. ఇక ఇంతకు ముందులానే ఈ సినిమాని తమిళంలో సూర్య, హిందీలో అమీర్ ఖాన్ చేస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రల్లో నటించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ప్రస్తుతం ఉన్న రోజులను బట్టి చూస్తే ఆమీర్ ఖాన్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమాను కూడా చేయడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో అమీర్ ఖాన్ తో సినిమా చేస్తే 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.ఇక గజిని మూవీ దర్శకుడు అయిన మురుగదాస్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు.
ఇక ఇదంతా చూస్తుంటే తండేల్ సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే ఇప్పుడు గజిని టాపిక్ ని తీసుకొచ్చారు అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తండేల్ సినిమా రిలీజ్ కి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి సినిమా యూనిట్ విపరీతంగా కష్టపడుతున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. కాబట్టి ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే వస్తాయి అంటూ ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా నాగచైతన్య స్టార్ హీరోగా ఎదుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…