https://oktelugu.com/

మహేష్ స్టేషన్స్ చుట్టూ తిరగలేక అలిసిపోయాడట !

అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పై పోలీసు కేసు పెట్టారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పైగా ఇండస్ట్రీలోనే ఓ సీనియర్ పెద్ద మనిషి ఈ విషయం చెప్పడంతో ఈ వార్త మరింతగా వైరల్ అయింది. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఓ సినిమా పైరసీ విషయంలో మహేష్ బాబు ముందుకు రావడం జరిగింది. అయితే రివర్స్‌లో మహేష్ పైనే కేసు పెట్టారు. అప్పుడు మహేష్ […]

Written By:
  • admin
  • , Updated On : February 3, 2021 / 12:10 PM IST
    Follow us on


    అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పై పోలీసు కేసు పెట్టారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పైగా ఇండస్ట్రీలోనే ఓ సీనియర్ పెద్ద మనిషి ఈ విషయం చెప్పడంతో ఈ వార్త మరింతగా వైరల్ అయింది. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఓ సినిమా పైరసీ విషయంలో మహేష్ బాబు ముందుకు రావడం జరిగింది. అయితే రివర్స్‌లో మహేష్ పైనే కేసు పెట్టారు. అప్పుడు మహేష్ బాబు స్టేషన్స్ చుట్టూ తిరగలేక చచ్చాడు పాపం’ అంటూ తమ్మారెడ్డిగారు వివరించారు. జరిగేది కొంత అయితే, తమ్మారెడ్డిగారు చెప్పేది బోలెడంత.

    Also Read: ‘ఆచార్య’ ఆదాయం 200 కోట్లు !

    ఇంతకీ మహేష్ పై ఎప్పుడు కేసు పెట్టారు ? ఎక్కడ పెట్టారు అంటే.. అప్పట్లో తన అర్జున్ సినిమా విషయంలో వరంగల్ వెళ్లి ఓ ఇంట్లో మహేష్ బాబు పైరసీ సీడిని పట్టుకున్నాడట. అయితే వాళ్ళు తమ పై మహేష్ బాబు దాడి చేశారు అంటూ మహేష్ పై రివర్స్ కేసు పెట్టారని.. దాంతో మహేష్ స్టేషన్స్ చుట్టూ తిరగలేక అలిసిపోయాడని తమ్మారెడ్డి తెలిపాడు. అయినా సూపర్ స్టార్ మీదే కేసు పెట్టడం, ఆ కేసు దెబ్బకు మహేష్ కూడా అలిసిపోతే.. ఇక ఎవరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి పైరసీ మీద పోరాడతారు. అన్నిటికిమించి కేసులు పెడుతుంటే పక్కన ఉన్నవారు కూడా పట్టించుకొరు.

    Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’.. !

    ఇప్పటికైనా పైరసీ రాయుళ్ల ఆట కట్టించాలంటే ఇండస్ట్రీ అంతా కలిసిరావాలి, అర్జున్ సినిమా సమయంలోనే మహేష్ బాబు ఇలా రోడ్డెక్కాడు. ఆయనకు తోడుగా అప్పుడు పవన్ కళ్యాణ్ సహా చాలా మంది ఉన్నా.. అప్పుడు మహేష్ పై కేసు పడకుండా ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయినా నాలుగు గంటలు లోపే కచ్చితంగా దాన్ని పైరసీ చేసి తమ సైట్లల్లో పేటేస్తున్నారు. ఇప్పటికే వందల సైట్లు మూయించేసినా.. మళ్ళీ పుట్ట గొడుగుల్లా అవి పుట్టుకొచ్చేస్తున్నాయి అంటే.. పైరసీ సామ్రాజ్యాన్ని ఎవ్వరూ అంత తేలిగ్గా ఆపలేరు. ఆపాలంటే ప్రభుత్వం తరుపున నుండే కఠినమైన నియమాలు రావాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్