https://oktelugu.com/

‘ఆచార్య’ ఆదాయం 200 కోట్లు !

మెగాస్టార్ ఆచార్య.. ఈ సినిమా మార్కెట్ ఫై కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. పైగా పూజా హెగ్డేను కూడా హీరోయిన్ తీసుకున్నారు. అన్నిటికీ మించి కొరటాల శివ డైరక్షన్. అందుకే ఆచార్య మార్కెటింగ్ వ్యవహారం వందల కోట్లు దాటేస్తోందనేది తాజాగా వినిపిస్తోన్న టాక్. ఇప్పటికే మొత్తం 200 కోట్లు దాటేస్తోందని తెలుస్తోంది. ఆంధ్రలో 60 కోట్ల రేషియోలో అమ్మగా, నైజాంలో వరంగల్ శ్రీనుకు 40 నుంచి 45 […]

Written By:
  • admin
  • , Updated On : February 3, 2021 / 11:20 AM IST
    Follow us on


    మెగాస్టార్ ఆచార్య.. ఈ సినిమా మార్కెట్ ఫై కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. పైగా పూజా హెగ్డేను కూడా హీరోయిన్ తీసుకున్నారు. అన్నిటికీ మించి కొరటాల శివ డైరక్షన్. అందుకే ఆచార్య మార్కెటింగ్ వ్యవహారం వందల కోట్లు దాటేస్తోందనేది తాజాగా వినిపిస్తోన్న టాక్. ఇప్పటికే మొత్తం 200 కోట్లు దాటేస్తోందని తెలుస్తోంది. ఆంధ్రలో 60 కోట్ల రేషియోలో అమ్మగా, నైజాంలో వరంగల్ శ్రీనుకు 40 నుంచి 45 కోట్ల మధ్యలో కోట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు కూడా నైజాం హక్కులు కోసం పోటీ పడుతున్నాడు.

    Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’.. !

    కాగా మొత్తం మీద ఆచార్య థియేటర్ హక్కులు 150 కోట్ల వరకు వుంటాయట. అలాగే ఇక నాన్ థియేటర్ హక్కులు ఎలాగూ ఉంటాయి. ఓవరాల్ గా 200 కోట్లు దాటేసేలా వుంది ఆచార్య ఆదాయం. చరణ్ తో పాటు నిర్మాత నిరంజన్ రెడ్డి పై లాభాల వర్షం కురిసినట్టే. ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట.

    Also Read: ‘ఉప్పెన’ తీసుకొస్తున్న ఎన్టీఆర్

    కాగా రామ్‌చరణ్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం సారథి స్టూడియోలో ఓ పురాతన దేవాలయం సెట్ వేశారని.. వచ్చే వారం నుండి ఆ సెట్ లో మెగాస్టార్ పై సాంగ్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు జానీ మాస్టర్ వచ్చే షెడ్యూల్ లో రెండు సాంగ్స్ ను కంపోజ్ చేయనున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్