Rajamouli Vs Atlee: సినిమాలు అందరూ చేస్తారు కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల దర్శకులకుగాని, హీరోలకు గాని ఎక్కువ క్రేజ్ ఉంటుంది. దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతోంది. అలాంటి రాజమౌళి ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తుండటం విశేషం… రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజువల్ గా చాలా క్లారిటీగా ఉంటూనే కథపరంగా ఎక్కడ మైనస్ పాయింట్ లేకుండా చూసుకుంటాడు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. తన సినిమాలో ఏ ఒక్క మిస్టేక్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.
ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయంటే ఆయన ఎంత కేర్ఫుల్ గా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి రాజమౌళి ఇప్పుడు చేస్తున్న సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడు. తద్వారా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతాడా? లేదా అనేది దాని మీదనే సర్వత్రా ఆసక్తి నెలకొంది…
ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ సినిమాతో భారీ రేంజ్ ను సంపాదించుకున్న ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో రాజమౌళిని ఢీకొడతాను అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట ఇక చూస్తుంటే తమిళులు సైతం రాజమౌళి ఢీకొట్టేది అట్లీనే అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు…ఇక ఇదంతా చూసిన తెలుగు జనాలు మాత్రం అట్లీ డైరెక్షన్లో అన్ని కాపీ సీన్సే ఉంటాయి.
అందులో నుంచి రెండు సీన్లు ఇందులో నుంచి రెండు సీన్లు తీసి సినిమాలు చేసే అట్లీ రాజమౌళి స్టాండర్డ్స్ లో సినిమా చేస్తాడు అనుకోవడం కలవుతుంది ఎందుకంటే ఆయనకు అంత స్టాండర్డ్ అయితే లేదు ఒకవేళ ఉన్నప్పటికీ రాజముండ్రి బీట్ చేసే సినిమాలు మాత్రం చేయలేని వాస్తవం… ఎన్ని జన్మలెత్తినా కూడా రాజమౌళిని టచ్ చేయలేడు అంటూ తిరుగు ప్రేక్షకులు కమిటీలకు చాలా గట్టి వార్నింగ్ అయితే ఇస్తున్నారు…