
Vijayakanth Heads Abroad: స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ ‘విజయ్ కాంత్’ స్పెషల్ ట్రీట్మెంట్ కోసం నిన్న అమెరికాకు బయలుదేరారు విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ఈ రోజు ఉదయం నుంచే అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ ‘విజయ్ కాంత్’ ఆరోగ్యం పై అభిమానులు మళ్ళీ అందోళన పడుతున్నారు. విజయకాంత్ స్పెషల్ ట్రీట్మెంట్ కోసం నిన్న అమెరికాకు బయలుదేరారు. దీంతో విజయకాంత్ కు ఏమైంది అంటూ ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరోపక్క ఆయన ఆరోగ్యం పై అనేక తప్పుడు ఊహాగానాలు బాగా వైరల్ అవుతున్నాయి.
నిజానికి ‘విజయకాంత్’ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ మధ్య ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను సింగపూర్ కి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయినా, ఆయన ఆరోగ్యం అలాగే ఉండటంతో.. అమెరికాకు కూడా తీసుకెళ్లి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇప్పించారు.
కానీ, విజయకాంత్ ఆరోగ్యం ఆశించినంతగా మెరుగుపడకపోయే సరికి.. ఆయన పూర్తిగా మంచానికే పరిమితం అయ్యారు. మాట్లాడే సామర్థ్యంతో పాటు తానుగా లేచి నిలబడే శక్తిని కూడా కోల్పోయారు. విజయకాంత్ బాధను చూడకలేక అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొదటి నుంచి విజయకాంత్ ది ప్రత్యేక శైలి.
ఆయన ఫ్యాన్స్ తో ఆయనకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. రజిని – కమల్ లాంటి స్టార్లు ఉన్నా… విజయకాంత్ అంటే.. ఏమైనా చేసే ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు. అందుకే, విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ఈ రోజు ఉదయం నుంచే అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమెరికాకు విజయకాంత్ తో పాటు ఆయన కుమారుడు షణ్ముగపాండియన్ కూడా వెళ్లారు.
అసలు విజయకాంత్ ఆరోగ్యం మరీ ఇంతలా దెబ్బ తినడానికి ముఖ్య కారణం సెకెండ్ వేవ్ లో ఆయనకు కరోనా సోకింది. అయితే, కరోనా నుండి ఆయన విజయవంతంగా కోలుకున్నప్పటికీ.. అప్పటి నుంచి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయి.