Nuzvid Job Mela: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నాలుగు సంస్థల్లో 195 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. కృష్ణా జిల్లా నూజివీడులోని(Nuzvid) రైతు బజార్ రోడ్డులో ఉన్న ధర్మ అప్పారావు కాలేజీలో ఈ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నారు. 8374039719, 9848819682 నంబర్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ జాబ్ మేళా ద్వారా మోర్ రిటైల్ ఇండియాలో 30 ఉద్యోగ ఖాళీలు, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ లో 15 ఉద్యోగ ఖాళీలు, హీరో మోటో కార్పొరేషన్ లో 50 ఉద్యోగ ఖాళీలు, రైజింగ్ స్టార్స్ హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లో 100 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. www.apssdc.in వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మోర్ రిటైల్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 11,500 రూపాయల వేతనం లభిస్తుంది.
పది, ఆపైన విద్యార్హతలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. పార్ట్ టైం ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 6,400 రూపాయల వేతనం లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్‌లో డిగ్రీ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు 15 వేల రూపాయల వేతనం లభించనుండగా 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 15వేల రూపాయల వేతనం లభిస్తుంది. రైజింగ్ స్టార్స్ హై టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అసెంబ్లింగ్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 10,200 రూపాయల వేతనం లభిస్తుంది. 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. హీరో మోటో కార్పొరేషన్‌లో ప్రాడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలకు ఐటీఐ పాసైన స్త్రీలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 14,977 రూపాయల వేతనం లభిస్తుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు నెల్లూరులోని శ్రీసిటీలో పని చేయాల్సి ఉంటుంది. ఏపీ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.