https://oktelugu.com/

Prakash Raj’s double standard :అప్పట్లో చిరంజీవి ముందు అలా.. ఇప్పుడు ఎన్టీఆర్ ముందు ఇలా..ప్రకాష్ రాజ్ డబుల్ స్టాండర్డ్స్ కి సాక్ష్యం ఇదే!

అతి తక్కువ మంది నటులలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. ఇప్పటికీ కూడా చెక్కు చెదరని డిమాండ్ తో, పాన్ ఇండియన్ లెవెల్ లో అవకాశాలను సంపాదిస్తూ దూసుకుపోతున్న మహా నటుడు ఆయన. సినీ నటుడిగా ఇంత గొప్ప పేరు తెచ్చుకున్న ఆయన వ్యక్తిగతంగా మాత్రం అనేక విమర్శలు ఎగురుకుంటూ వచ్చాడు

Written By:
  • Vicky
  • , Updated On : October 4, 2024 / 09:39 PM IST

    Prakash Raj

    Follow us on

    Prakash Raj’s double standard : దేశం గర్వించదగ్గ నటులలో ఒకరు ప్రకాష్ రాజ్. పాజిటివ్ క్యారక్టర్ అయినా, నెగటివ్ క్యారక్టర్ అయినా ప్రకాష్ రాజ్ జీవించేస్తాడు. అందుకే ఆయన కేవలం ఒక ఇండస్ట్రీ కి చెందిన వాడు కాదు, దేశం లో ఉన్న అన్ని భాషలకు సంబంధించిన నటుడు అని అందరూ అంటుంటారు. ఆయన నటనకు ఎన్నో పురస్కారాలు కూడా లభించాయి. నేషనల్ అవార్డుని అందుకున్న అతి తక్కువ మంది నటులలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. ఇప్పటికీ కూడా చెక్కు చెదరని డిమాండ్ తో, పాన్ ఇండియన్ లెవెల్ లో అవకాశాలను సంపాదిస్తూ దూసుకుపోతున్న మహా నటుడు ఆయన. సినీ నటుడిగా ఇంత గొప్ప పేరు తెచ్చుకున్న ఆయన వ్యక్తిగతంగా మాత్రం అనేక విమర్శలు ఎగురుకుంటూ వచ్చాడు. అంతే కాదు సోషల్ మీడియా లో ఈయన ఇప్పటికీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు.

    ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గానే మేకర్స్ ఒక సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ లో ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ ఈ చిత్రాన్ని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ని చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కొరటాల శివ కథ, దాని మీద ఎన్టీఆర్ పెట్టిన నమ్మకం. ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో ప్రేమ. ఆస్కార్ అవార్డ్స్ వేడుక లో ఎంతోమంది దిగ్గజ నటుల మధ్య ఎన్టీఆర్ నిలబడి మాట్లాడుతుంటే నాకు ఎంతో గర్వం వేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్నటువంటి స్టార్ హీరోలలో నాకు బాగా ఇష్టమైన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఎన్టీఆర్ మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. ఇది ఇలా ఉండగా అప్పట్లో ఎన్టీఆర్ కి, ప్రకాష్ రాజ్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉండేవి అని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉండేది. అందుకు కారణం ఇంద్ర 175 రోజుల వేడుక. ఈ వేడుక లో ప్రకాష్ రాజ్ చిరంజీవి గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు.

    ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య కొంతమంది హీరోలు ఒకటి రెండు హిట్లు కొట్టగానే అన్నయ్య తర్వాత మేమే అని అంటున్నారు. వాళ్లకు ఒక్కటే చెప్తున్నాను, చిరంజీవి గారు ట్యూబ్ లైట్ అయితే, మీరంతా ఆ ట్యూబ్ లైట్ చుట్టూ తిరిగే పురుగులు లాంటోళ్ళు. ఆయనతో మీకు పోలికా?’ అంటూ సంచలన కామెంట్స్ చేసాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి చేసినవే అని అనేవారు. అలాంటి స్థాయి నుండి ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకునే దాకా వచ్చాడంటే,అప్పటికీ ఇప్పటికీ ఈయన అభిప్రాయం ఏమైనా మారిందా?, లేకపోతే రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తున్నాడా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.