Nagarjuna: ఆ సినిమా విషయం లో నాగార్జునను తక్కువ అంచనా వేసిన తమిళ్ ఇండస్ట్రీ…

ప్రతి లవ్ స్టోరీ కి దీనిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో మణిరత్నం నాగార్జున ని చూపించిన విధానం కూడా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంటుంది.

Written By: Gopi, Updated On : February 15, 2024 2:56 pm
Follow us on

Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో యువసామ్రాట్ గా పేరు పొందిన నాగార్జున చాలా మంచి నటుడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ లో ఆయన చాలా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి మెప్పించాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి పాత్ర ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా సెట్ చేసుకొని మరి ఆ సినిమాలను చేసి ఆ పాత్రలకి ప్రాణం పోశాడనే చెప్పాలి.

ఇక శివ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన నాగార్జున అదే టైంలో మణిరత్నం దర్శకత్వంలో గీతాంజలి అనే సినిమా చేశాడు. అయితే తమిళ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన మణిరత్నం తెలుగులో నాగార్జునతో సినిమా చేస్తున్నాడు అనగానే తమిళ్ ఇండస్ట్రీ లోని కొంతమంది ప్రొడ్యూసర్లు గానీ, హీరోలు గాని మణిరత్నం ను హేళన చేసి మాట్లాడినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. ఎందుకంటే నాగార్జునకి అప్పట్లో మార్కెట్ అంతలా లేదు. దానికి తోడుగా నాగార్జునతో రొమాంటిక్ లవ్ స్టోరీ ని చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ తమిళ్ ఇండస్ట్రీ మొత్తం మణిరత్నం ను తప్పుబట్టారు. కానీ మొత్తానికైతే ఆయన గీతాంజలి అనే సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ప్రస్తుతం ఇండియాలో ఉన్న క్లాసిక్ సినిమాలన్నింటిలో గీతాంజలి కూడా చోటు సంపాదించుకుందనే చెప్పాలి.

ఇక ఈ సినిమాతో ఇటు మణిరత్నం, ఆటు నాగార్జున ఇద్దరూ కూడా తమదైన రీతిలో సక్సెస్ లను అందుకుని తమిళ్ ఇండస్ట్రీలో ఎవరైతే వీళ్ళ కాంబినేషన్ ను హేళన చేసి మాట్లాడారో వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పారు. ఇక ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా కూడా లవ్ స్టోరీ సినిమా వచ్చిందంటే గీతాంజలి సినిమా లా ఉందా అంటు ఈ సినిమాతో పోలుస్తూ ఉంటారు.

ప్రతి లవ్ స్టోరీ కి దీనిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో మణిరత్నం నాగార్జున ని చూపించిన విధానం కూడా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంటుంది. అలాగే హీరోయిన్ కి, నాగార్జునకి మధ్య వచ్చే సీన్స్ లో ఇద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది…