Smita Sabharwal: మేడం మీరు సరస్వతి దేవత.. స్మితా సబర్వాల్ ఫిదా..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం లేని పోస్టులోకి వెళ్లిపోయిన స్మితా సబర్వాల్ ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

Written By: Suresh, Updated On : February 15, 2024 2:41 pm
Follow us on

Smita Sabharwal: స్మితా సబర్వాల్.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనామక పోస్టులోకి వెళ్లిపోయారు గాని.. అప్పట్లో భారత రాష్ట్ర సమితి అధికారం ఉన్నప్పుడు అధికారం మొత్తం ఆమెదే. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా కొనసాగే వారు. మిషన్ భగీరథ పనులు పర్యవేక్షించేవారు. హెలికాప్టర్లో చక్కర్లు కొట్టేవారు. ఔట్ లుక్ అనే మాగ్జిన్ కేసు విషయంలో కోర్టు ఫీజులకు ప్రభుత్వ ఖజానా నుంచే పైసలు ఖర్చు పెట్టారు. అంతేకాదు అత్యంత కీలకమైన నిర్ణయాల్లో ఆమె భాగస్వామిగా ఉన్నారు. ఎలాగూ ఈసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఆమె ధీమాగా ఉన్నారు. కానీ ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫలితంగా ఆమెకు అప్రాధాన్య పోస్టు దక్కింది. అప్పట్లో కీలక అధికారిగా ఉన్నప్పుడే స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండేవారు. ఫోటోలు, రీల్స్ తో తెగ సందడి చేసేవారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం లేని పోస్టులోకి వెళ్లిపోయిన స్మితా సబర్వాల్ ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు..ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. బుధవారం వసంత పంచమిని పురస్కరించుకొని స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో తనను అనుసరించే వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 1999 లో దిగిన ఒక ఫోటోను షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోను చూసిన ఒక నెటిజన్ స్మితా సబర్వాల్ ఫిదా అయ్యేలాగా కామెంట్ చేశాడు. దీనికి ఆమె కూడా రిప్లై ఇచ్చారు.

21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ స్థానికంగా ఓ ఫోటో గ్రాఫర్ ద్వారా ఫోటో తీయించుకున్నారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోను చూస్తూ చాలామంది రకరకాల కామెంట్లు చేశారు. కానీ ఒక నెటిజన్ మాత్రం “మీరు అచ్చం సరస్వతి దేవి లాగా ఉన్నారని” కామెంట్ చేశారు. దీనికి ఆమె థాంక్స్ అని రిప్లై ఇచ్చారు. ఇంకో మహిళా నెటిజన్ “సో బ్యూటిఫుల్, సో ఎలిగేంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్ మేడం” అంటూ కామెంట్ చేసింది. ఆమె చేసిన కామెంట్ కు స్మిత సబర్వాల్ లాఫింగ్ ఎమోజితో రిప్లై ఇచ్చింది. అయితే చాలామంది నెటిజెన్లు కామెంట్లు చేసినప్పటికీ.. ఒక నెటిజన్ చేసిన కామెంట్ కే స్మిత రిప్లై ఇవ్వడం విశేషం.

ఇక స్మిత సబర్వాల్ ఇటీవల ట్విట్టర్ ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. దీనికి అనేకమంది నెటిజన్లు రిప్లై ఇచ్చారు. కానీ ఒక వ్యక్తి చేసిన కామెంట్లు మాత్రం ఆమె ఫిదా అయిపోయారు. అందరిలాగా అతడు కామెంట్ చేయకుండా.. ఏకంగా స్మిత సబర్వాల్ మీద ఒక కవిత రాశాడు. దానిని చదివిన స్మిత సబర్వాల్ లవ్ సింబల్ ఎమోజితో అతనికి రిప్లై ఇచ్చింది. స్మిత రిప్లై ఇవ్వడంతో చాలామంది ఆ యువకుడిని ఆకాశానికి ఎత్తేశారు. మా అందరికీ రిప్లై ఇవ్వలేదు కానీ.. నీకు మాత్రమే ఇచ్చింది అంటూ ఆట పట్టించారు. కేవలం పోస్ట్లు మాత్రమే కాకుండా రీల్స్ కూడా స్మిత సబర్వాల్ బాగా చేస్తారు. అప్పట్లో ఆమె రంగనాయక సాగర్ వద్ద చేసిన రీల్ వివాదాస్పదమైంది.