Dhoni And Vikram: సినీతారలతో పాటు క్రికెట్ తారలకు కూడా అభిమానులుంటారు. కానీ ఇద్దరు కలిస్తే ఇక అంతే సంగతి. అభిమానులకు పండగే. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే చెన్నైలో చోటుచేసుకుంది. క్రికెట్ తేజం, భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, తమిళ ప్రముఖ నటుడు విక్రమ్ కలుసుకున్నారు. చెన్నై వేదికగా వీరి సమావేశం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి హాట్ న్యూస్ కు తావులేదని తెలుస్తోంది. విక్రమ్ కు ధోని అంటే అభిమానం. దీంతోనే వీరిద్దరి కలయిక జరిగినట్లు చెబుతున్నారు.

ఇటీవల విక్రమ్ నటించిన మహాన్ చిత్రం ట్రైలర్ విడుదల ఈ రోజు కావడంతోనే వీరిద్దరు కలుసుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఐపీఎల్ సన్నాహాల కోసం మహేంద్ర సింగ్ ధోని చెన్నైలోనే ఉండటంతో విక్రమ్ కోరిక మేరకు ఇద్దరు మీటయినట్లు వార్తలు వస్తున్నాయి. మహాన్ చిత్రంలో విక్రమ్ తనయుడు ధ్రువ కూడా నటించినట్లు తెలుస్తోంది. అందుకే మహిని ఆహ్వానించినట్లు విక్రమ్ వెల్లడించారు. దీంతో ఏవేవో పుకార్లు హల్ చల్ చేస్తుండగా దీనిపై అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

విక్రమ్ కూడా తెలుగువారికి సుపరిచితుడే. తన చిత్రాలు తెలుగులో కూడా విడుదల కావడం తెలిసిందే. అపరిచితుడు చిత్రంలో విక్రమ్ నటనకు తెలుగు వారు సైతం ఫిదా అయిపోయారు. దీంతో ఈసారి మహాన్ చిత్రం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా అపరిచితుడు నుంచి విక్రమ్ చిత్రాలు విజయం సాధించలేదు. దీంతో ఆయనకు విజయం కచ్చితంగా అవసరమే. లేకపోతే తన మనుగడకే ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది.
Also Read: రిలీజ్ డేట్లు వస్తున్నాయ్.. చిరంజీవి చెప్పిన మంచిరోజులు ఏమైనట్టు..?
మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు సారధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో అవలంభించబోయే వ్యూహాలపై చర్చిస్తున్నాడు. ఆటగాళ్ల వేలం నుంచి అన్ని విషయాలు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే లక్ష్యంతోనే ధోని పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆటగాళ్ల ఎంపిక దగ్గర నుంచి తనదైన ముద్ర వేస్తున్నాడు. ఎవరెవరిని తీసుకోవాలి అనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నాడు.
వచ్చే సీజన్ లో ధోని రిటైర్మెంట్ కానున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనుకున్న ధోని ఐపీఎల్ కు కూడా టాటా చెప్పాలని భావిస్తున్నాడు. ఇదే చివరి అవకాశం కావడంతో అభిమానులకు విజయం అందించి వారిలో స్ఫూర్తి నింపాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి విక్రమ్, ధోని కలయికలో ఎలాంటి ఉద్దేశాలు లేవని కేవలం స్నేహపూర్వకంగానే కలిసినట్లు భావిస్తున్నారు.
Also Read: ‘కీర్తి సురేష్’ను పెట్టుకుని ఎందుకు లాస్ అవుతారయ్యా ?
[…] […]
[…] […]