New Judges To TS High Court: సీజేఐ ఎన్వీ రమణ ఏదో ఒక పనితో నిత్యం తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అనేక విషయాలపై ముక్కుసూటిగా మాట్లాడుతూ సిసలైన జడ్జి అనిపించుకుంటున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాట జనాన్ని చైతన్య వంతం చేసే దిశగానే ఉండటం గమనార్హం. పైగా తెలుగు వ్యక్తిగా ఉండి తెలుగు వారికి మరింత కీర్తిని తీసుకువస్తున్నారనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాలకు మరింత మేలు చేకూర్చే పనే చేశారు.

హైకోర్టుల్లో జడ్జిలను నియమించే క్రమంలో ఇంతకు ముందు తాత్సారం జరిగిందనేది కాదనలేని సత్యం. అయితే సీజేఐ వచ్చిన తర్వాత మాత్రం చాలా మార్పులే కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న మూడు రోజుల క్రిందట ఏపీకి ఏడుగురు కొత్త జడ్జిలని నియమించిన విషయం తెలిఇసందే. ఎన్వీ రమణ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొలీజియం వీరిని ఏపీకి కేటాయించింది.
Also Read: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ గేమ్ ప్లాన్?
అయితే ఇప్పుడు తెలంగాణకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఈ కొలీజియం. టీఎస్ హైకోర్టుకు ఏకంగా 12 మందిని కొత్త జడ్జిలగా నియమించారు ఎన్వీరమణ. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసింది ఈ కొలీజియం. అయితే వీరు ప్రకటించిన వారిలో ఏడుగురు లాయర్లు అలాగే ఐదుగురు జడ్జిలు ఉన్నారు. నిన్న జరిగిన కొలీజియం మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్వీ రమణ సీజేఐ అయిన తర్వాతనే తెలంగాణకు జడ్జిల సంఖ్యను పెంచారు. ఆయన ఇప్టి వరకు నియమించిన వారితో అంతకు ముందు 24 గా ఉన్న జడ్జిల సంఖ్య 42కు పెరిగింది. ఇక ఎప్పటికప్పుడు ఏర్పడుతున్న ఖాళీలను కూడా ఆయన త్వరగానే భర్తీ చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఏడుగురిని సిఫార్సు చేశారు ఎన్వీ రమణ. ఇలా ఒకేసారి ఇంతమందిని నియమించడం కూడా ఇదే మొదటిసారి.
Also Read: కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో ఇవే అంశాలుంటాయా…?