Megastar Chiranjeevi: త్వరలోనే మంచి రోజులొస్తాయి. జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుంది.. అని చిరంజీవి గతంలో జగన్ తో మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన మాటలు ఇవి. జగన్ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచిన వివాదం ఎంతలా చిచ్చు రేపిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం మీద మాట్లాడేందుకు స్వయంగా చిరంజీవి జగన్ తో సమావేశం అయ్యారు. తనతో జగన్ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.

పరిశ్రమ తరఫున బాధ్యత తీసుకునే వెళ్లానని చెప్పారు చిరంజీవి. ఇక జగన్ కూడా త్వరలోనే ఓ కొత్త డ్రాఫ్ట్ ను రెడీ చేసి మళ్లీ సినీ పెద్దలందరినీ పిలిచి మాట్లాడుతానంటూ చిరంజీవితో చెప్పినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. అయితే ఇన్ని రోజులు అయినా దాని మీద మళ్లీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు పెద్ద సినిమాలు అన్నీ కూడా రిలీజ్ డేట్లను అనౌన్స్ చేస్తున్నాయి. ఫిబ్రవరి నుంచే సినిమా జాతర షురూ కానుంది
Also Read: ‘కీర్తి సురేష్’ను పెట్టుకుని ఎందుకు లాస్ అవుతారయ్యా ?
ఆర్ ఆర్ ఆర్ నుంచి చిరంజీవి ఆచార్య దాకా అన్నీ రిలీజ్ డేట్లు ప్రకటించేస్తున్నాయి. మరి చిరంజీవి చెప్పినట్టు ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అంటే సమాధానమే లేదు. టికెట్ల రేట్లు తగ్గింపుపై ఎలాంటి క్లారిటీ రాకుండానే సినిమాలు విడుదల ఎలా చేస్తారన్నది మరో ప్రశ్న. ఇప్పుడు ఫిబ్రవరి 14 దాకా ఏపీలో నైట్ కర్ఫ్యూ ఉంది. పైగా థియేటర్లలో కూడా 50శాతం ఆక్యుపెన్సీ ఉంది. ఈ నిబంధనలు పెంచే అవకాశం కూడా ఉంది.
మరి జగన్ టికెట్ రేట్లను తగ్గిస్తారా.. ఆ మేరకు ఏమైనా హామీ ఇచ్చారా అంటే ఎవరూ స్పందించట్లేదు. మరి చిరంజీవి లాంటి పెద్ద కు జగన్ గౌరవం ఇస్తారా అంటే ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఓ వైపు ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతున్నారు. పీఆర్సీపై పెద్ద గొడవే జరుగుతోంది. కాబట్టి జగన్ వారిని దారిలోకి తెచ్చుకునే పనిలోనే బిజీగా ఉంటున్నారు. ఈ గ్యాప్‌లో టికెట్ రేట్ల గురించి ఆలోచించే పరిస్థితులు అయితే లేవు.
Also Read: ఇటు ‘ప్రభాస్ – రాజమౌళి’కి పోటీ.. అటు ‘పవన్ – అజిత్’ కి పోటీ !
[…] […]
[…] […]