https://oktelugu.com/

Vijay Sethupathi : రామ్ చరణ్ సినిమాలో నటించేంత ఖాళీగా నేను లేను అంటూ తమిళ హీరో విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్!

#RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

Written By:
• Vicky
• , Updated On : December 16, 2024 / 01:46 PM IST

Vijay Sethupathi

Follow us on

Vijay Sethupathi :  #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన సినిమాల కోసం కేవలం మన తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించడానికి చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు ఆర్టిస్టులు. కానీ ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి మాత్రం వదులుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం డైరెక్టర్ బుచ్చి బాబు విజయ్ సేతుపతిని నటించాల్సిందిగా కోరాడు. కానీ విజయ్ సేతుపతి మాత్రం చాలా సున్నితంగా రిజెక్ట్ చేశాడట.

గతంలో బుచ్చి బాబు విజయ్ సేతుపతి తో కలిసి ‘ఉప్పెన’ చిత్రం కోసం పని చేసాడు. ఇందులో ఆయనకు చాలా పవర్ ఫుల్ క్యారక్టర్ ని ఇచ్చాడు. ఆ క్యారక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద పాన్ ఇండియన్ సినిమాలో నటించమని కోరితే విజయ్ సేతుపతి రిజెక్ట్ చేయడానికి ఒక కారణం ఉంది. నిన్న తన ‘విడుదల 2’ మూవీ ప్రొమోషన్స్ కోసం వచ్చిన విజయ్ సేతుపతి ని, ఒక ప్రెస్ మీట్ లో రిపోర్టర్ ప్రశ్న అడుగుతూ ‘సార్..మీరు రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమాలో నటిస్తున్నారా?’ అని అడగగా లేదు సార్ అని విజయ్ సేతుపతి సమాధానం ఇస్తాడు. ఎందుకు సార్ అని రిపోర్టర్ అడగగా ‘నా దగ్గర సమయం లేదు సార్..ఒక్కోసారి కెరీర్ లో భారీ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. కానీ మనసుకి నచ్చే పాత్ర దొరకాలి కదా. అందుకో ఆ పాత్రకి నేను సరిపోను అనిపించింది. అందుకే ఒప్పుకోలేదు’ అని సమాధానం ఇచ్చాడు విజయ్ సేతుపతి.

అయితే విజయ్ సేతుపతి బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ అనే చిత్రంలో నటించాడు. ఇందులో విజయ్ సేతుపతి రెగ్యులర్ విలన్ రోల్ లోనే కనిపించాడు. ఆయన పాత్రలో పెద్దగా ప్రత్యేకత కనిపించలేదు. అయినప్పటికీ ఒప్పుకొని చేసాడు, కానీ రామ్ చరణ్ సినిమాని మాత్రం రిజెక్ట్ చేసాడు అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే నెల 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ఈ నెల 21 వ తారీఖు నుండి మొదలు కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలయ్యాయి.

రామ్ చరణ్ సినిమా లో నటించడానికి నాకు టైం లేదు#RamCharan #VijaySethupathi pic.twitter.com/ZVLQrXDyxu
— Telugu360 (@Telugu360) December 15, 2024