Vidamuyarchi Movie : తమిళ సూపర్ స్టార్ అజిత్(Thala Ajith) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విడాముయార్చి'(Vidamuyarchi Movie) భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అజిత్ లాంటి సూపర్ స్టార్ నుండి ఇలాంటి సినిమాలను ఆశించలేదంటూ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసారు. ఇలాంటి సినిమాల్లో స్టార్ హీరో ఎలిమెంట్స్ లేకపోయినప్పటికీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండడం అత్యవసరం. ఎక్కడా కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకూడదు. అలాంటివి మిస్ అవ్వకుండా తీస్తే స్టార్ హీరో అయినప్పటికీ జనాలు ఆదరిస్తారు. కానీ ఈ సినిమాలో అదే మిస్ అయ్యింది. చాలా పేలవంతవమైన స్క్రీన్ ప్లే తో అభిమానుల సహనానికి పరీక్ష పెట్టారు. ఫలితంగా అజిత్ రీసెంట్ గా చేసిన సినెమాలన్నిటికంటే పెద్ద ఫ్లాప్ అయ్యింది. మిగిలిన ప్రాంతాల్లో వసూళ్లు ఎలా ఉన్నా, అజిత్ కి తమిళం లో టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వస్తాయి .
కానీ ఈ చిత్రం తమిళనాడు లో కూడా ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోలేదు. ఇది అజిత్ స్టార్ స్టేటస్ కి చాలా అవమానకరం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకు కేవలం 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. అజిత్ గత చిత్రం తూనీవు కి కూడా ఫ్లాప్ టాక్ తో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటిది ఈ చిత్రం కేవలం 140 దగ్గరే ఆగిపోయిందంటే అజిత్ కి డేంజర్ బెల్స్ మోగాయి. ఇక నుండి కెరీర్ ని సీరియస్ గా తీసుకోకపోతే స్టార్ హీరోల లీగ్ నుండి బయటకు రాక తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ కి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న ఒప్పదం ప్రకారం ఈ చిత్రం వచ్చే నెల 28 న నెట్ ఫ్లిక్స్ లోకి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో ఆదరణ దక్కించుకోలేకపోయింది ఈ చిత్రం కనీసం ఓటీటీ ఆడియన్స్ ని అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి. ఇలాంటి సినిమాలు ఎక్కువగా థియేటర్స్ లో కంటే ఓటీటీ లోనే బాగా ఆడుతుంటాయ్. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రెజీనా కాసాండ్రా, అర్జున్ విలన్స్ గా నటించారు. హీరోయిన్ రెజీనా కి ఇది విలన్ గా నాల్గవ చిత్రం. అదే విధంగా ఈ సినిమాకి అనిరుద్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకోలేకపోయింది.