Trivikram Srinivas Son
Trivikram Srinivas : మన తెలుగు సినీ ఇండస్ట్రీ లో కేవలం డైరెక్టర్ బ్రాండ్ ఇమేజ్ ని చూసి థియేటర్స్ కి కదిలే ప్రేక్షకులు లక్షల సంఖ్యలో ఉంటారు. సూపర్ స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు ఈ దర్శకులు. అలాంటి దర్శకుల లిస్ట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కచ్చితంగా ఉంటాడు. ఒక రచయితగా కెరీర్ ని మొదలు పెట్టిన ఈ మాటల మాంత్రికుడు అ తర్వాత దర్శకుడిగా మారి సృష్టించిన సంచలనాలను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. అటు రచయితగా, ఇటు దర్శకుడిగా ఎన్నో మర్చిపోలేని మధురమైన క్లాసిక్ చిత్రాలను అందించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే ఆయన సినిమాలంటే అభిమానులు చెవి కోసేసుకుంటారు. ఎంతమంది పాన్ ఇండియన్ డైరెక్టర్స్ అయినా పుట్టుకొని రావొచ్చు, కానీ త్రివిక్రమ్ బ్రాండ్ ఇమేజ్ ని రీ ప్లేస్ చేసేవాళ్ళు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎవ్వరూ లేరు. అలాంటి సెన్సేషనల్ డైరెక్టర్ వారసుడు త్వరలోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కి రిషి అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి లాగానే ఇతను చాలా తెలివైనవాడు. ఆయనకు ఉన్నంత జ్ఞానం ఈయనకు కూడా ఉంది. ఇతనికి కూడా తన తండ్రి లాగానే గొప్ప డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది. చాలా కాలం నుండి ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వద్ద శిక్షణ తీసుకుంటున్న రిషి, నేటితో ఆ శిక్షణ పూర్తి చేశాడట. ఇక త్వరలోనే సందీప్ వంగా(Sandeep Reddy Vanga), ప్రభాస్(Rebelstar Prabhas) కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘స్పిరిట్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయబోతున్నాడట. ఇప్పటికే ఆయన టీం లో కూడా చేరిపోయాడట. నేటి తరం యూత్ ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యే విధంగా సినిమాలు తీసే సందీప్ వంగ లాంటి వైల్డ్ ఆలోచనలు ఉన్న డైరెక్టర్ తో కలిసి ప్రయాణం చేయడం అనేదే రిషి కి ఒక గొప్ప అనుభవం అని చెప్పొచ్చు.
కేవలం ఒక్క సినిమా అతనితో కలిసి ప్రయాణం చేసినా, వంద సినిమాల అనుభవం వస్తుంది. అంత నేర్చుకోవచ్చు అన్నమాట. రిషి సరైన డైరెక్టర్ చేతిలో పడ్డాడు. గతం లో రిషి, పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ తదితరులు కలిసి యూట్యూబ్ లో ఒక షార్ట్ ఫిలిం తీశారు. రిషి డైరెక్టర్ కాగా, అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ షార్ట్ ఫిలిం కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిషి పూర్తి స్థాయి డైరెక్టర్ అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అకిరా నందన్ సినిమాల్లోకి రావడానికి కూడా రెండేళ్ల సమయం పడుతుందని అందరు అంటున్నారు. కాబట్టి వీళ్లిద్దరు కలిసి మొదటి సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు అభిమానులు. చూడాలి మరి భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అనేది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలను చూసుకుంటూ, త్వరలో అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ కోసం కూడా పనిచేస్తున్నాడు.