Tamannaah Bhatia: నేషనల్ వైడ్ గా మోస్ట్ ట్రెండింగ్ కపుల్ గా నిల్చిన జంట తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మ(Vijay Varma). తమన్నా అందానికి విజయ్ వర్మ ఏ మాత్రం సరిపోడని చాలా మంది సోషల్ మీడియా లో వీళ్ళ ప్రేమ వ్యవహారం తెలిసినప్పుడు కామెంట్స్ చేసారు. అంతే కాదు తమన్నా కి ఉన్నటువంటి స్టార్ స్టేటస్ తో పోలిస్తే విజయ్ వర్మ దరిదాపుల్లో కూడా ఉండదు. ఒక విధంగా ఆయన దేశం మొత్తం పాపులర్ అవ్వడానికి ప్రధాన కారణం తమన్నానే. అయినప్పటికీ తమన్నా అతన్ని ఇష్టపడింది, డేటింగ్ చేసింది, చివరికి పెళ్లి చేసుకుందాం అని తమన్నా ప్రపోజల్ పెట్టగానే, నీకు నాకు సెట్ అవ్వదు అని విజయ్ బ్రేకప్ చెప్పేసాడు. తమన్నా అతని కోసం తన కెరీర్ ని కూడా పక్కన పెట్టాలని అనుకుంది. కానీ చివరికి తన ప్రియుడి నుండి ఈ ట్విస్ట్ ఎదురు అవ్వడం ఆమెకు కూడా పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.
ఇదంతా పక్కన పెడితే ఈ జంట బాలీవుడ్ లో ఎంతో మంది టాప్ సెలెబ్రెటీలకు బాగా క్లోజ్ అయ్యింది. ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్(Raveena Tandon) కుటుంబానికి ఈ జంట ఎంతో దగ్గరైంది. రవీనా తాండన్ కూతురు రాషా టండన్(Rasha Tandon) తమన్నా, విజయ్ లతో తనకు ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ తమన్నా నేను ఒక పుట్టినరోజు వేడుకలో కలుసుకున్నాం. ఒక టాప్ సింగర్ అక్కడ పాట పాడుతుంటే నేను స్టేజి ముందు డ్యాన్స్ వేస్తూ ఉన్నాను. తమన్నా కూడా ఆ పక్కనే డ్యాన్స్ వేస్తూ నాకు కనిపించింది. ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి డ్యాన్స్ వేసాము. అలా నాకు తమన్నా పరిచయమైంది. చాలా తక్కువ సమయంలోనే ఆమెతో నేను చాలా క్లోజ్ అయిపొయాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘తమన్నా, విజయ్ లు నాకు ఎంత క్లోజ్ అంటే వాళ్ళని చూడకుండా నేను ఉండలేను, ఖాళీ సమయం దొరికితే వాళ్ళ ఇంట్లో వాలిపోతాను, అంతలా నాకు వాళ్లిద్దరూ కనెక్ట్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్లిద్దరూ నాకు దేవుడిచ్చిన తల్లిదండులు’ అంటూ చెప్పుకొచ్చింది. అంటే తమన్నా నాకు దేవుడి ఇచ్చిన అమ్మ అని రాషా టండన్ చెప్పడం వల్లే తమన్నా కి పెళ్లి కాకుండానే ఇంత పెద్ద కూతురు ఉంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాషా టండన్ కి సరిగ్గా 20 ఏళ్ళు. జనవరి నెలలో ఈమె ఆజాద్ అనే చిత్రం తో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు కానీ, రాషా టండన్ కి మాత్రం మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.