Bald Head: అప్పట్లో .. దాదాపు 16 సంవత్సరాల క్రితం .. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించే సంస్థ హెయిర్ ఆయిల్ ను ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. లీగల్ ఇబ్బందుల వల్ల ఆ ఆయిల్ పేరును ఇక్కడ మేము మెన్షన్ చేయడం లేదు.. సరే అసలు విషయానికి వస్తే.. నా ఆయిల్ రుద్దుకుంటే బట్టతల పై జుట్టు వస్తుందని.. చివరికి ఆయిల్ రాసిన అరచేయిపై కూడా జుట్టు మొలుస్తుందని.. హెచ్చరించారు.
ఈ ప్రకటన వినూత్నంగా ఉండడంతో.. చాలామంది ఆ ఆయిల్ కొనుక్కున్నారు. ఆ ఆయిల్ తయారుచేసిన సంస్థ కోట్ల లాభాలు కళ్ల చూసింది. కానీ ఒక్కరికి కూడా జట్టు వచ్చిన దాఖలాలు లేవు. పైగా ఈ వ్యవహారంపై ఓ పత్రిక పతాక శీర్షిక లో వార్తలను ప్రచురించింది. ఆ తర్వాత జాకెట్ యాడ్ ఇవ్వగానే చల్లబడింది. ఇప్పుడిక అదే సంస్థ మరో కొత్త పేరుతో హెయిర్ ఆయిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఆ న్యూస్ ఛానల్ యజమాని ఇప్పుడు అధికారంలో ఉన్న ఓ పార్టీలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లకు కోట్లు సంపాదిస్తాడన్నమాట. గతంలో ఎటువంటి అధికారం లేనప్పుడే అతడు హెయిర్ ఆయిల్ ద్వారా దండిగా సంపాదించాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నాడు కాబట్టి మస్తుగా పైసలు వెనకేసుకుంటాడు. ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే.. ఇలాంటి ఘటన పంజాబ్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో జరిగింది. అక్కడ బట్టతలపై జుట్టు మొలిపిస్తామని చెబితే 67 మంది ఓ శిబిరం వద్దకు వెళ్లారు. చివరికి మోసపోయారు.
ఇన్ ఫెక్షన్లు వచ్చి..
పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ ప్రాంతంలో జుట్టు చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బట్టతల ఉన్నవారికి జుట్టు మొలిపిస్తామని నిర్వాహకులు చెప్పారు. దీంతో 67 మంది ఆ శిబిరం వద్దకు వెళ్లారు. నిర్వాహకులు అడిగినంత ముట్ట చెప్పారు. చివరికి ఆ 67 మంది తలపై నూనె రాస్తే రకరకాల ఇన్ఫెక్షన్లు సోకాయి. కొంతమంది తలపై పుండ్లు అయ్యాయి. ఇంకొంతమంది తల వాచిపోయింది. అక్కడక్కడ కణితులు కట్టాయి. దీంతో వారు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు ఆ శిబిరం నిర్వహించిన వ్యక్తులను అరెస్టు చేశారు. ” సంగ్రూరు ప్రాంతంలో కొంతమంది హెయిర్ రిక్రియేషన్ క్యాంప్ నిర్వహించారు. శిబిరం ఏర్పాటుకు ఎటువంటి అనుమతులు లేవు. పైగా శిబిరం నిర్వహించిన వారు డెర్మటాలజిస్టులు కారు. వారంతా కూడా మోసపూరిత వ్యక్తులు. మాయా ప్రకటనలు చేసి అమాయకులను తమ బుట్టలో వేసుకున్నారు. చివరికి లేనిపోని రసాయనాలను బట్ట తల ఉన్న వారిపై పూశారు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్లు సోకాయి. దీంతో వారంతా ఇప్పుడు ఆస్పత్రిలో చేరారు. ఫిర్యాదు రావడంతో శిబిరంపై దాడులు నిర్వహించాం.. దీనికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేశామని” సంగ్రూర్ పోలీసులు చెబుతున్నారు.