Tollywood: జ్యోతిలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆ సినిమా తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యారు సత్యదేవ్. హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జోడీగా నటిస్తున్న చిత్రం “గుర్తుందా సీతాకాలం”. ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ గా నిలిచిన “లవ్ మాక్‌టైల్ ” చిత్రానికి రీమేక్ వెర్షన్ గా “గుర్తుందా సీతాకాలం” తెరకెక్కిన విషయం తెలిసిందే. నాగశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాబోతున్నట్టు మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రకటించారు. అయితే ఆ నెల్లో మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య, రవితేజ ఖిలాడీ సినిమాలు విడుదల తేదీలు లాక్ చేసుకున్నాయి. ప్రస్తుతం “గుర్తుందా సీతాకాలం” చిత్రానికి ఏ డేట్ ను ఫిక్స్ చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఇది లవ్‌స్టోరీ కాబట్టి బహుశా వేలెంటైన్స్ డే ను టార్గెట్ చేస్తారేమోనని వార్తలు వస్తున్నాయి. ఎందుకుంటే రాబోయే వేలెంటైన్స్ మంత్ లో దేవ్, నిధిలతో ప్రేమలో పడండి అని పోస్టర్ మీద మెన్షన్ చేశారు మేకర్స్. చూడాలి మరి ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల అవుతుందో లేదో చూడాలి.
This valentines month come fall in love with Dev & Nidhi. #GurthundhaSeethakalam in theatres from Feb 2022❤️#Guts@ActorSatyaDev @tamannaahspeaks@nagshekar @akash_megha @IAmKavyaShetty @kaalabhairava7 @nagshekarmov #VedaksharaMovies #ManikantaEntertainments
@anandaudioTolly pic.twitter.com/oFx61wQW1l— Vamsi Kaka (@vamsikaka) December 13, 2021