https://oktelugu.com/

Tamannaah Marriage: ప్రియుడితో తమన్నా పెళ్లి… ముహూర్తం కూడా ఫిక్స్, ఎప్పుడంటే?

ప్రియుడితో తమన్నా ఏడడుగులు వేయనుందట. ఈ మేరకు బాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ల నుండి ఎఫైర్ నడుపుతున్న తమన్నా.

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2023 / 06:16 PM IST

    Tamannaah Marriage

    Follow us on

    Tamannaah Marriage: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. ముఖ్యంగా పెళ్లి రైట్ ఏజ్ లో చేసుకోవాలి. 25 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయం అంటారు పెద్దలు. ఈ రోజుల్లో 30 ఏళ్ళు వచ్చినా జనాలు పెళ్లి మాట ఎత్తడం లేదు. కెరీర్, గోల్స్ అంటూ పరుగులు తీస్తున్నారు. ఇక హీరోలు, హీరోయిన్స్ అయితే చెప్పక్కర్లేదు. కొందరైతే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతున్నారు. తమన్నాభాటియాకు పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆమె ప్రస్తుత వయసు 33 ఏళ్ళు. చెప్పాలంటే ఏజ్ బార్ అయినట్లే. కాగా ఎట్టకేలకు పెళ్లి పైకి మనసు మళ్లిందట.

    ప్రియుడితో తమన్నా ఏడడుగులు వేయనుందట. ఈ మేరకు బాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ల నుండి ఎఫైర్ నడుపుతున్న తమన్నా… పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇందుకు సమయం కూడా ఫిక్స్ చేశారట. కొన్ని ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న తమన్నా… 2024 ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కనుందట. విజయ్ వర్మ-తమన్నా వివాహ బంధంలో అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు.

    లస్ట్ స్టోరీస్ సీజన్ 2లో విజయ్ వర్మ, తమన్నా కలిసి నటించారు. వీరి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కాయి. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లోనే ఒకరిపై మరొకరికి మనసు అయ్యిందట. ఏడాది కాలంగా విజయ వర్మ-తమన్నా ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు కథనాలను ఖండిస్తూ వచ్చారు. ఇటీవల ఇద్దరూ ఓపెన్ అయ్యారు. విజయ్ వర్మతో నేను రిలేషన్ లో ఉన్నానని తమన్నా చెప్పుకొచ్చింది. అతడు తనకు రక్షణగా ఉంటాడనే నమ్మకం ఉంది. అందుకే ప్రేమించానని తమన్నా వెల్లడించింది.

    తమన్నా స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయ్యింది. కానీ కొన్ని క్రేజీ ఆఫర్స్ ఆమె తలుపు తడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చిరంజీవికి జంటగా భోళా శంకర్ చేసింది. రజినీకాంత్ జైలర్ లో ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేసింది. ఒక్క రోజు వ్యవధిలో జైలర్, భోళా శంకర్ విడుదలయ్యాయి. భోళా శంకర్ డిజాస్టర్ కాగా, జైలర్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. జైలర్ మూవీలో తమన్నా చేసిన ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్ దేశాన్ని ఊపేసింది.