Bigg Boss 7 Telugu: చూసుకుందాం రా… హౌస్లో కొట్టుకోబోయిన యావర్- అమర్ దీప్!

స్ప్రైట్ కోసం నామినేట్ చేసిన యావర్ అంటూ అమర్ అనడంతో .. నువ్వు చేసిన బిహేవియర్ కరక్టా .. అంటూ యావర్ రైజ్ అయ్యాడు. నువ్వు చూసావా .

Written By: NARESH, Updated On : November 14, 2023 6:22 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగుతుంది. కాగా నేటి ప్రోమోలో యావర్ – అమర్ దీప్ ల మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది. రతిక .. నువ్వు బయటకి వెళ్ళొచ్చిన దానివి ఎవరి మీద ఇలాంటి పాయింట్లు చెప్పకు అంటూ అమర్ చెప్పాడు. ఇంతలో యావర్ ‘అది తనకి కరెక్ట్ ఏమో .. నా దృష్టి లో కరెక్ట్ కాదు అంటూ పాయింట్ రైజ్ చేసాడు. ‘ తవ్వుకుంటూ పోతే.. అందరి జాతకాలు అంతే .. ఏమంత గొప్ప జాతకాలు కావు ఎవరివీ అని అమర్ అన్నాడు.

స్ప్రైట్ కోసం నామినేట్ చేసిన యావర్ అంటూ అమర్ అనడంతో .. నువ్వు చేసిన బిహేవియర్ కరక్టా .. అంటూ యావర్ రైజ్ అయ్యాడు. నువ్వు చూసావా .. రతికతో చెప్పడం నువ్వు చూశావా అంటూ యావర్ పైకి వెళ్ళాడు అమర్. ఇక ఇద్దరు కొట్టుకున్నంత పని చేశారు. అరుచుకుంటూ ఒకరి పైకి మరొకరు దూసుకెళ్లారు. దాంతో కెప్టెన్ శివాజీ మధ్యలోకి వెళ్లి ఇద్దర్ని ఆపే ప్రయత్నం చేశాడు.

ఇక ‘ అమర్ పోవాలి .. పోవాలి అంటూ డైలాగులు కొట్టాడు అమర్ దీప్. ఆ తర్వాత శివాజీ, గౌతమ్ ని నామినేట్ చేశాడు. అగ్రెషన్ తగ్గించుకోవాలి అని శివాజీ, గౌతమ్ కి సూచించాడు. ఎమోషన్స్ లైక్ లూస్ మోషన్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్ .. ప్లాను ఆపలేం అని కౌంటర్ ఇచ్చాడు గౌతమ్. దాన్నే కంట్రోల్ చేసుకోవాలిరా .. మంచిదిరా అని శివాజీ కూల్ గా చెప్పాడు.

ఇలా ఈ వారం నామినేషన్స్ హౌస్ ని హీటెక్కించాయి. గత వారం రాజమాతలు శోభా,ప్రియాంక .. రతిక ని అన్యాయంగా నామినేట్ చేశారు. దానికి రతిక నిన్నటి నామినేషన్స్ లో ఇద్దరికి చెమటలు పట్టించింది. ఇద్దర్ని ఒక ఆట ఆడుకుంది. ఇక ఎప్పుడూ కూల్ గా ఉండే అర్జున్ కూడా నామినేషన్స్ లో రెచ్చిపోయాడు. శోభా శెట్టి, ప్రశాంత్ తో గొడవకి దిగాడు. మొత్తానికి ఇది కదా నామినేషన్స్ అంటే .. అనేట్టుగా ఉంది ప్రోమో.