కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించారు. సమస్యలపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీలో పాల్గొన్నారు. సౌత్ స్టేట్స్ అయిన ఏపీ, తెలంగాణ, తమిళనాడు. కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, లక్ష్యద్వీప్, అండపాన్ ప్రతినిధులు ఈ భేటికా హాజరయ్యారు. అయితే తిరుపతిలో ఈ భేటి జరిగినందున ఏపీ సీఎం జగన్ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు తెలంగాణ కు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయని భావించారు. కానీ అవేమీ జరుగలేదు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ మధ్య సాగుతున్న జల వివాదం సమస్య తొలిగిపోతుందని భావించిన వారికి నిరాశే మిగలింది. ఏపీ సీఎం జగన్ కొన్ని సమస్యలను ప్రస్తావించినా అమిత్ షా అవేమీ పట్టించుకోలేదు.

కేంద్రం అజెండాలో భాగమైన డ్రగ్స్, శాంతిభద్రతల విషయాలపైనే ఎక్కువగా చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రోజురోజుకు అనేక సమస్యలు పెరిగిపోతున్నాయి. అంతర్రాష్ట్ర వివాదాలు ముదురుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రతీ ఏటా ప్రశేపెట్టే బడ్జెట్లో సైతం దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర చిన్న చూపు చూస్తోంది. దీంతో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నందున దక్షిణాది రాష్ట్రాల మండలి భేటీలో ఇవి పరిష్కారానికి సీఎంలు ప్రయత్నించారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీల మధ్య ఎన్నో రోజులుగా సాగుతునన విభజన వివాదాల్ని ఇప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు.
ఏపీ సీఎం జగన్ విభజన నేపథ్యంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సుధీర్ఘంగా అన్ని విషయాలను ప్రస్తావించారు. మిగతా రాష్ట్రాలు కూడా వాటి సమస్యలను ప్రస్తావించాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ భారీగా విభజన హామీలను ఇచ్చింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు కలిసి అనేక సమస్యలను కేంద్రం ముందుంచుతున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్, తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ విభజన హామీలను అమిత్ షా ముందుంచారు.
కానీ అమిత్ షా మాత్రం డ్రగ్స్ కట్టడి, ఫోక్సే నేరాల అదుపుపై మాట్లాడారు. అంతేకాకుండా కొవిడ్ సమస్యలు, వ్యాక్సినేషన్ విషయాలపై చర్చించారు. పేరుకు దక్షిణాది మండలి సమావేశం అయినా దేశీయ సమస్యలపై దృష్టి పెట్టారు. ఇక పుదుచ్చేరిని కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్రంగా మార్చాలన్న డిమాండ్ సైతం పట్టించుకోలేదు. ఇక తెలుగు రాష్ట్రాలకు అతిముఖ్యమైన విభజన సమస్యపై అమిత్ షా మౌనంగా ఉండిపోవడంతో కౌన్సిల భేటిలో పాల్గొన్న వారికి నిరాశే ఎదురైంది.