Tamannaah Bhatia: సౌత్ ఇండియన్ లో సుమారుగా రెండు దశాబ్దాల నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ, ఇప్పటికీ కూడా కొత్త హీరోయిన్స్ ధాటిని తట్టుకొని నిలబడి, వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ తమన్నా. పాలరాతి శిల్పం లాంటి రూపు రేఖలతో, స్వర్గం నుండి దిగి వచ్చిన దేవకన్య లాగ అనిపించే తమన్నా, ఇన్ని రోజులు తన కెరీర్ లో నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ వచ్చింది. అందం తో పాటు అభినయం, స్టార్ హీరోలు సైతం వణికిపోయే రేంజ్ డ్యాన్స్ విన్యాసాలు ఈమెకి మాత్రమే సొంతం.
అందుకే తమన్నా కి ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు ఆమె గ్లామర్ షోస్ అయితే చేసింది కానీ, ఇప్పటి వరకు ముద్దు సన్నివేశాల్లో మాత్రం నటించలేదు. ఒకవేళ ముద్దు సన్నివేశాలు చెయ్యాల్సి వచ్చినా పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేది కాదు, ఎదో అలా పైపైకి చేసి చేతులు దులుపుకునేది. ఆమె రొమాంటిక్ సన్నివేశాలు చూస్తే ఎవరికైనా అది అర్థం అయిపోతుంది.
నా తల్లితండ్రులు నా చిత్రాలు చూసేటప్పుడు తల దించుకోకూడదు, అందుకే అలాంటి సన్నివేశాల్లో నేను నటించను అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పింది. ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు మనమంతా కొత్త తమన్నా ని చూస్తున్నాము. ఎప్పుడైతే ఆమె టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్లిందో, హద్దులన్నీ దాటేసింది. అక్కడి ఆడియన్స్ కోసం తాను నమ్ముకున్న సిద్ధాంతాలను పక్కన పెట్టేసింది. ఇష్టమొచ్చినట్టు రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ, అసలు మనం చూస్తున్నది నిజంగా తమన్నానేనా అని ఆమె వీరాభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
రీసెంట్ గా విడుదలైన ‘జీకర్డా’ మరియు ‘లస్ట్ స్టోరీస్’ వంటి వెబ్ సిరీస్ లలో తమన్నా హద్దులు దాటేసింది. గత వారం రోజుల నుండి ఎక్కడ చూసినా ఈమె అస్లీల వీడియోలు మరియు ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక్కమాట లో చెప్పాలంటే బరితెగించేసింది. ఇది ఆమె అందాలను ఆస్వాదించే అభిమానులకు నచ్చొచ్చు, కానీ ఆమె సిద్ధాంతాలను చూసి అభిమానులైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇలా చేస్తున్నందుకు సిగ్గు పడుతున్నారు.