Rajamouli- NTR: దర్శక ధీరుడు రాజమౌళి తో పని చెయ్యడం అనేది ఒక అదృష్టం లాగ భావిస్తుంటారు మన స్టార్ హీరోలు. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ఆరంభించి, నేడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆస్కార్ అవార్డుని రప్పించడం వరకు రాజమౌళి సినీ ప్రయాణం ఏ స్టార్ డైరెక్టర్ కి కూడా ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇప్పటి వరకు కేవలం ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్ , ప్రభాస్ మరియు రవితేజ వంటి స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసాడు. త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు. పైన చెప్పిన హీరోలలో ఆయన ఎక్కువగా సినిమాలు చేసింది జూనియర్ ఎన్టీఆర్ తోనే. వీళ్లిద్దరి కెరీర్ ఒకే సంవత్సరం లో ప్రారంభమైంది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత ‘సింహాద్రి’, ‘యమదొంగ’ మరియు #RRR వంటి చిత్రాలు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. వీటిల్లో #RRR ఒక్కటే మల్టీస్టార్ర్ర్ చిత్రం, మిగిలిన సినిమాలన్నీ సోలో సినిమాలే. ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యి ఎన్టీఆర్ ని మాస్ లో తిరుగులేని స్టార్ హీరో గా నిలబెట్టాయి. అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ నుండి మరో సినిమా కూడా రాబోతుందట. ఈ చిత్రానికి బడ్జెట్ ఏకంగా 5000 కోట్ల రూపాయలట. గతం లో ఎన్టీఆర్ తో రాజమౌళి ‘గరుడ’ అనే చిత్రం చెయ్యాలనుకున్నాడు.
త్వరలో ఆయన తో చెయ్యబోతున్న సినిమా కూడా ఇదే కావొచ్చు, అందుకే అంత బడ్జెట్ ఖర్చు అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా, అక్కడి హీరోలు సైతం ఎన్టీఆర్ నటన కి సెల్యూట్ చేసే విధంగా ఇందులో ఎన్టీఆర్ ని చూపించబోతున్నాడట రాజమౌళి. ప్రస్తుతం మహేష్ తో ఒక సినిమా చేస్తున్న రాజమౌళి, ఈ సినిమా పూర్తి అవ్వగానే ఈ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.