Photo Story: స్టేజిపై ఓ పాటకు పెర్ఫార్మర్ చేస్తున్న ఈ పాపను చూశారా? ఈమె ఇప్పుడో స్టార్ హీరోయిన్. దాదాపు రెండు దశాబ్దాలుగా పరిశ్రమను ఏలుతుంది. తెలుగులో స్టార్ గా ఎదిగిన ఈమె తర్వాత సౌత్ లో బిజీ అయ్యారు. అనంతరం బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేశారు. ఇండియా వైడ్ ఈమెకు ఫేమ్ ఉంది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్, రామ్ చరణ్, మహేష్, చిరంజీవి ఇలా అందరు టాప్ స్టార్స్ తో జతకట్టింది. ఈ వివరణ విన్నాక మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అవును ఈమె ఎవరో కాదు మన మిల్కీ బ్యూటీ తమన్నా.
తమన్నా ఇంస్టాగ్రామ్ లో తన స్కూల్ డేస్ ఫోటో షేర్ చేసింది. ఆ ఫొటోలో తమన్నా స్కూల్ కల్చరల్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఆమె వేదిక మీద డాన్స్ చేస్తున్నారు. ఈ ఫొటోకు తమన్నా ఆసక్తికర వివరణ ఇచ్చారు. చిన్నప్పటి నుండి నచ్చిన పాటలకు డాన్స్ చేయడం ఆస్వాదిస్తాను అంటూ కామెంట్ పెట్టింది. తమన్నా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. తమన్నా లేటెస్ట్ ప్రాజెక్ట్ లస్ట్ స్టోరీస్ 2. నెట్ఫ్లిక్స్ లో 29 జూన్ నుండి స్ట్రీమ్ కానుంది.
లస్ట్ స్టోరీస్ 2 లో మృణాల్ ఠాకూర్, కాజోల్ కూడా ప్రధాన పాత్రలు చేస్తున్నారు. విజయ్ వర్మతో తమన్నాకు బోల్డ్ సీన్స్ ఉన్నాయని టీజర్ చూస్తే తెలుస్తుంది. తమన్నా-విజయ్ వర్మ ఎఫైర్ లో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. లస్ట్ స్టోరీస్ 2 లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ డోసు ఎక్కువగానే ఉంది. తమన్నా ఈ క్రేజీ ఆంథాలజీ సిరీస్లో ఎలాంటి పాత్ర చేశారో చూడాలి. లస్ట్ స్టోరీస్ సిరీస్ 1 లో కియారా అద్వానీ, రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్ బోల్డ్ సన్నివేశాల్లో నటించారు.
ఇక తెలుగులో తమన్నా చిరంజీవికి జంటగా భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. ఇది తమిళ హిట్ వేదాళం రీమేక్ గా తెరకెక్కుతుంది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన మెగాఫోన్ పట్టారు. భోళా శంకర్ మూవీలో చిరంజీవి లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మరో కీలక రోల్ చేస్తున్నారు. ఆమె చిరంజీవి చెల్లి పాత్ర చేయడం విశేషం. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే రజినీకాంత్ కి జంటగా జైలర్ మూవీ చేస్తుంది తమన్నా.